Rohit Sharma : రోహిత్ శర్మ పై లక్నో ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అతడు వస్తే..
ఒకవేళ రోహిత్ శర్మ వేలంలోకి వస్తే ప్రతి ఫ్రాంచైజీ అతడి కోసం పోటీపడుతుంది.

Rohit Sharma in LSG Fielding coach Jonty Rhodes drops massive hint
Rohit Sharma – LSG : ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు మెగా వేలాన్ని నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరల్లో మెగా వేలం ఉండొచ్చు. ఇప్పటికే అన్ని ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకోవాల్సిన ఆటగాళ్లపై దృష్టి సారించాయి. అదే సమయంలో వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్ల పై ఓ కన్నేశాయి. ఇక ఐపీఎల్ 2024 సీజన్ సమయంలో ముంబై ఇండియన్స్‌లో జరిగిన పరిణామాల నేపథ్యంలో స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ మెగావేలంలో పాల్గొంటాడనే వార్తలు వస్తున్నాయి.
ఐపీఎల్‌లో విజయవంతమైన కెప్టెన్లలో రోహిత్ శర్మ ఒకడు. ముంబై ఇండియన్స్‌కు ఐదు సార్లు టైటిల్‌ను అందించాడు. కెప్టెన్‌గానే కాకుండా ఓ ఆటగాడిగా విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఎన్నో ఆడాడు. ఇలాంటి ఆటగాడు మెగా వేలంలోకి వస్తే అతడిని సొంతం చేసుకునేందుకు అన్ని ఫ్రాంచైజీలు పోటీపడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ రోహిత్ గనుక మెగావేలంలోకి వస్తే అతడిని సొంతం చేసుకునేందుకు లక్నో సూపర్ జెయింట్స్ సిద్ధంగా ఉన్నట్లుగా ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.
ఓ ఇంటర్వ్యూలో జాంటీ రోడ్స్ మాట్లాడుతూ.. ‘ఒకవేళ రోహిత్ శర్మ వేలంలోకి వస్తే ప్రతి ఫ్రాంచైజీ అతడి కోసం పోటీపడుతుంది. అతడు గొప్ప ఆటగాడు. అతడిని సొంతం చేసుకునేందుకు లక్నో సైతం ఆసక్తిగా ఉంది. ముంబైకి ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్న సమయంలో రోహిత్‌తో చాలా క్లోజ్‌గా పని చేశా. అతడి బ్యాటింగ్ స్టైల్ అంటే నాకు ఎంతో ఇష్టం.’ అని జాంటీ రోడ్స్ అన్నాడు.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2022, 2023 సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఐపీఎల్ 2024 సీజన్‌లో నిరాశపరిచింది పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ఇటీవల భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌ను తమ జట్టు మెంటార్‌గా నియమించుకుంది.
Glenn Maxwell : అరెరె.. మాక్స్‌వెల్ ది పళ్ల సెట్టా..? సీక్రెట్ బయట పెట్టిన మిచెల్ మార్ష్..