PAK vs BAN : ఇది కదా పాక్ ఫీల్డింగ్ అంటే.. ఒక్క బంతి కోసం ముగ్గురు.. ఇంత అలర్ట్‌గా ఉన్నారేంట్రా బాబు?
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఓడి విమర్శల పాలైంది పాకిస్తాన్ జట్టు.

Pakistan poor fielding saud shakeel dropped catch at slip in pak vs ban 2nd test
Pakistan vs Bangladesh : బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఓడి విమర్శల పాలైంది పాకిస్తాన్ జట్టు. ఈ నేపథ్యంలో రావల్పిండి వేదికగా శనివారం నుంచి ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పరువు దక్కించుకోవాలని ఆరాటపడుతోంది. ఇంతటి కీలక మైన మ్యాచ్‌లో ఆటగాళ్లు ఎంతో అలర్ట్‌గా ఉండాలి. ఏ చిన్న అవకాశాన్ని మిస్ చేయకూడదు. అది కూడా తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరు చేసిన సమయంలో లడ్డూలాంటి ఓ క్యాచ్‌ను పాక్ ఫీల్డర్లు చేజార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. బంగ్లా బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌ల్లో 274 పరుగులకు కుప్పకూలింది. సైమ్ అయూబ్ (58), షాన్ మసూద్ (57), ఆగా సల్మాన్ (54) లు హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిదీ హసన్ మిరాజ్ ఐదు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. తస్మిన్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా నహిద్ రాణా, షకీబ్ అల్ హసన్‌లు చెరో వికెట్ సాధించారు.
DPL : 6 బంతుల్లో 6 సిక్సర్లు.. రవిశాస్త్రి, యువరాజ్ తరువాత అతడే..
పాక్ ఇన్నింగ్స్ ముగిసినప్పటికి తొలి రోజు ఆట ముగిసేందుకు కొద్ది సమయం ఉండడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ ఆరంభించింది. రెండు ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లుగా జాకీర్ హసన్, షాద్మాన్ ఇస్లాంలు బరిలోకి దిగారు. తొలి ఓవర్‌ను మీర్ హమ్జా వేశాడు. తొలి బంతిని షాద్మాన్ ఇస్లాం ఆడాడు. బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి బ్యాట్ తాకుతూ అంచుని స్లిప్‌లోకి వెళ్లింది. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సౌద్ షకీల్ సులువైన క్యాచ్ అందుకోలేకపోయాడు. ఆ పక్కన ఉన్న మిగిలిన ఇద్దరు కూడా బాల్‌ను అందుకునేందుకు విఫలయత్నం చేశారు. మొత్తానికి ఈజీ క్యాచ్ నేలపాలైంది. ఈ క్యాచ్ పట్టుంటే పరుగుల ఖాతా తెరవకముందే బంగ్లాదేశ్ వికెట్ కోల్పోయి ఉండేది.
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా పాక్ పేలవ ఫీల్డింగ్‌తో సతమతమవుతోంది. దీన్ని ఉద్దేశిస్తూ.. ఇది కదా పాక్ ఫీల్డింగ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Glenn Maxwell : అరెరె.. మాక్స్‌వెల్ ది పళ్ల సెట్టా..? సీక్రెట్ బయట పెట్టిన మిచెల్ మార్ష్..
Pakistan Cricket Heritage pic.twitter.com/19j9XfapYr
— Danish (@PctDanish) August 31, 2024