Simha Rasi Phalalu 2026 : సింహ రాశి వారి జాగ్రత్త.. అష్టమ శని ప్రభావం.. కోర్టు కేసుల్లో ఇరుక్కునే అవకాశం..!
Simha Rasi Phalalu 2026 : ఈ సంవత్సరం సింహ రాశి వారికి ఎలా ఉండబోతుందో పండితులు చెప్పుకొచ్చారు.
ugadi panchangam sri parabhava nama samvatsara 2026 2027 simha rasi phalalu leo horoscope
Simha Rasi Phalalu 2026 : పరాభవ సంవత్సరంలో సింహ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని.. ఈ రాశి వారి మీద శని ప్రభావం ఉందని.. ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా కోర్టు కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది అంటున్నారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం-అవమానాలు సమానంగానే ఉంటాయని తెలిపారు. ఎంతో శ్రమిస్తే కానీ విజయం దక్కదని అంటున్నారు. ఈ రాశి వారిపై అష్టమ శని ప్రభావం ఉందని.. దాని వల్ల పనులు ఆలస్యం అవుతాయని.. కానీ గురుబలం వల్ల అంతిమంగా విజయం లభిస్తుందని తెలిపారు. ఆదాయం బాగానే ఉన్నా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయని తెలిపారు.
ఈ సంవత్సరం సింహ రాశి వారికి సామాన్యంగానే ఉంటుందని.. పెద్దగా మార్పులేం ఉండవంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఈ సంవత్సరం సింహ రాశి వారికి ఆదాయం: 5, వ్యయం: 5 అలానే రాజపూజ్యం: 7, అవమానం: 7 ఉంటుందన్నారు. ఈ సంవత్సరం సింహ రాశి వారికి శ్రమతో కూడిన విజయాలు లభిస్తాయని తెలిపారు. అయితే సేవాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు సహాయం చేయడం, దానధర్మాలు చేయడం వల్ల శని దోషాల నుండి ఉపశమనం కలుగుతుందన్నారు.
ఈ సంవత్సరం సింహ రాశి వారు తలపెట్టిన విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం అవుతాయని, అలానే పుణ్యక్షేత్ర సందర్శన, తీర్థయాత్రలు చేస్తారని చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య, బంధుమిత్రులతో చిన్న చిన్న విభేదాలు రావచ్చని.. మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రించుకోవాలని సూచిస్తున్నారు. అలానే అనవసర వివాదాల జోలికి వెళ్లవద్దని, కొన్ని సందర్భాల్లో కోర్టు కేసుల్లో ఇరుక్కునే పరిస్థితి వస్తుందని చెబుతున్నారు.
రంగాల వారీగా ఫలితాలు
- విద్యార్థులు: ఈ సంవత్సరం కర్టాకట రాశి విద్యార్థులకు జ్ఞాపకశక్తి తగ్గే అవకాశం ఉంది. ఏకాగ్రతను పెంచుకుని కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులు సాధిస్తారు.
- ఉద్యోగస్థులు: ఇష్టం లేని చోటికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ప్రైవేట్ రంగంలో ఉండేవారు ఉద్యోగాలు మారకుండా ఉండటం మంచిదంటున్నారు నిపు
- వ్యవసాయదారులు: వాతావరణం అనుకూలించక ఆశించిన మేర పంట దిగుబడి రాదని… సాధారణ లాభాలే ఉంటాయంటున్నారు.
- వ్యాపారస్తులు: స్పెక్యులేషన్ వ్యాపారం చేసేవారిపై అధికారుల దాడులు జరిగే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్ర పండితులు హెచ్చరిస్తున్నారు. ఇతర వ్యాపారులకు సాధారణ లాభాలు మాత్రమే ఉంటాయంటున్నారు
- కళాకారులు,క్రీడాకారులు: కర్కాటక రాశి క్రీడాకారులు, కళాకారులకు అవకాశాలు సులభంగా రావు. బాగా కష్టపడితేనే పేరు, డబ్బు సంపాదించగలుగుతారు.
- రాజకీయ నాయకులు: కర్టాకట రాశి నేతల పదవుల్లో మార్పులు వస్తాయి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి వారు చాలా శ్రమించాల్సి ఉంటుంది.
- స్త్రీలు: ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. భర్తతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండవచ్చు.
నక్షత్రాల వారీగా అదృష్ట సమయం
నక్షత్రం కలిసివచ్చే నెలలు అదృష్ట వారాలు సంఖ్యలు
- మఖ (1-4 పాదాలు) జూన్, జూలై, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి (2027) ఆది, బుధ, గురు 2, 3, 4, 5
- పుబ్బ (1-4 పాదాలు) జూన్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి (2027) బుధ, శుక్ర, శని 3, 5, 6, 7
- ఉత్తర (1వ పాదం) ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి (2027) బుధ, శుక్ర, శని 3, 4, 5, 9
పరిహారాలు-పూజలు:
- గ్రహ జపాలు: శని, కేతు గ్రహాలకు జపాలు చేయించుకోవాలి. నల్ల నువ్వులు, ఉలవలు దానం ఇవ్వాలి.
- దైవ దర్శనం: వేంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి మరియు అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవడం శుభప్రదం.
- అభిషేకం: శనివారాలు శని దేవునికి తైలాభిషేకం చేయించుకోవాలి.
- మంత్రం: అష్టమ శని దోష నివారణకు ప్రతిరోజూ 11 లేదా 21 సార్లు మృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి.
- పారాయణం: మార్కండేయ చరిత్రను చదవడం లేదా వినడం వల్ల ప్రతికూలతలు తగ్గుతాయి.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఇవ్వడమైనది. 10tv.in దీన్ని నిర్ధారించడం లేదు.
