Oppo F33 5G Sale : ఒప్పో ఫ్యాన్స్ మీకోసమే.. ఈ కొత్త 5G ఫోన్ సేల్ మొదలైంది.. ఇలా కొన్నారంటే మీ బడ్జెట్ ధరకే..!
Oppo F33 5G Sale : ఒప్పో మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఎఫ్33 5జీ ఫోన్ ఈ రోజు నుంచి అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ధర, ఆఫర్లు, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Oppo F33 5G Sale
- ఒప్పో ఎఫ్33 5జీలో 6.57-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్ప్లే
- 7000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6360 మ్యాక్స్ ప్రాసెసర్
- ఏప్రిల్ 29 నుంచి ఒప్పో ఎఫ్33 5జీ ఫోన్ సేల్ ప్రారంభం
Oppo F33 5G Sale : ఒప్పో అభిమానులకు అదిరిపోయే ఆఫర్.. మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో F33 5జీ సేల్ మొదలైంది. 50MP ప్రైమరీ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీని అమర్చారు.
మీడియాటెక్ డైమెన్సిటీ 6360 మ్యాక్స్ చిప్సెట్తో రన్ అవుతుంది. ఈ ఒప్పో ఫోన్ సేల్స్ ఏప్రిల్ 29 నుంచే (Oppo F33 5G Sale) ప్రారంభం కాగా భారీ డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు. ఒప్పో F33 5జీ ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్లను ఓసారి పరిశీలిద్దాం..
ఒప్పో F33 5జీ ధర, ఆఫర్లు :
ఒప్పో F33 5జీ ఫోన్ 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,999కు లభిస్తుంది. 8GB+128GB వేరియంట్ ధర రూ. 34,999, 8GB+256GB వేరియంట్ ధర రూ. 37,999గా ఉంది. బ్యాంక్ ఆఫర్లతో 10 శాతం తగ్గింపు పొందవచ్చు. ఏప్రిల్ 29 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ , అమెజాన్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఒప్పో అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది.
ఒప్పో F33 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఒప్పో F33 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.57-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్ప్లే అందిస్తుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP66, IP68, IP69 రేటింగ్ కూడా ఉంది. MIL-STD-810H సర్టిఫికేషన్ కూడా అందిస్తుంది.
మాలి-G57 MC2 జీపీయూతో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 మ్యాక్స్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 8GB వరకు LPDDR4X ర్యామ్, 256GB వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ఓఎస్ 16పై రన్ అవుతుంది.
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. ఒప్పో ఎఫ్ 33 5జీ బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 7000mAh బ్యాటరీతో వస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
