TPCC Chief Mahesh Goud: దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌దే అధికారం- టీపీసీసీ చీఫ్ జోస్యం
కవిత పార్టీ పెట్టి ఆనాడు జరిగిన దోపిడీ మీద స్పందింస్తుంటే జవాబు చెప్పలేని పరిస్థితిలో కేసీఆర్ సతమతం అవుతున్నారు. కుటుంబ తగాదా, ఆస్తి తగాదా తేల్చుకోలేని వ్యక్తులు రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఏం చేస్తారో మనం ఒకసారి ఆలోచించుకోవాలి.
TPCC Chief Mahesh Goud: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కులాలు, మతాల పేరిట దేశాన్ని బీజేపీ విభజిస్తోందని ఆరోపించారు. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కేసీఆర్ సతమతం అవుతున్నారన్న ఆయన.. కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాలు తేల్చుకోలేని వ్యక్తులు రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు. దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు మహేశ్ గౌడ్.
”స్వాతంత్ర్యమే వద్దన్న వ్యక్తులు దేశాన్ని పాలిస్తున్నారు. మతాల పేరిట, ప్రాంతాల పేరిట దేశాన్ని విభజించి వారి స్వార్ధం కోసం, అధికారంలో ఉండటం కోసం నానా ఇబ్బందులు పెడుతున్న తరుణంలో దేశం రాహుల్ గాంధీ వైపు చూస్తోంది. బీజేపీ ప్రభుత్వం అదానీ, అంబానీ లాంటి పెత్తందారులను పెంచి పోషిస్తుంది తప్ప సామాన్యుడికి ఎక్కడా లాభం చేకూర్చే పనులు చేయలేదు.
కవిత పార్టీ పెట్టి ఆనాడు జరిగిన దోపిడీ మీద స్పందింస్తుంటే జవాబు చెప్పలేని పరిస్థితిలో కేసీఆర్ సతమతం అవుతున్నారు. కుటుంబ తగాదా, ఆస్తి తగాదా తేల్చుకోలేని వ్యక్తులు రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఏం చేస్తారో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. పదేళ్లు జరిగిన దోపిడీ, ఆర్థిక విధ్వంసం, వారు కూడబెట్టుకున్న ఆస్తుల పంపకాల్లో తేడాల వల్లే ఇవాళ కవిత బయటకు వచ్చి పార్టీ పెట్టారు. ఈ దేశంలో ఎప్పుడు ఎన్నికలైనా రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది” అని మహేశ్ కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు.
Also Read: కేసీఆర్‌ను తిట్టడం బాధేసింది.. ప్రజలకు అమ్మ ఎలా అవుతుంది? కవితపై రాజగోపాల్ రెడ్డి ఫైర్
