Gold Price Today : బంగారం కొనేవాళ్లకు బిగ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
Gold Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా.. అయితే, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ గోల్డ్ రేటు పెరిగింది. వెండి ధర స్థిరంగాకొనసాగుతోంది.

బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే, మీకు షాకింగ్ న్యూస్. గోల్డ్ రేటు భారీగా పెరిగింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 440 పెరగ్గా.. 22క్యారెట్ల బంగారంపై రూ.400 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు భారీగా పెరుగుతోంది. ఔన్సు గోల్డ్ పై సుమారు 10 డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ రేటు 4,610 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,51,370 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,38,750 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,51,530కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,38,900 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,51,370కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,38,750 వద్ద కొనసాగుతుంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,65,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,60,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,65,000వద్దకు చేరింది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
