Tech Tips Telugu : ఐఫోన్లలో బ్యాటరీ సమస్యా..? ఐఫోన్ యూజర్లు ఇలా చేయండి.. ఆన్ కాకపోతే ఈ ట్రిక్ ట్రై చేయండి..!
Tech Tips Telugu : ఐఫోన్లలో బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయ్యాక ఆన్ చేయబోతే వెంటనే ఆన్ కావడం లేదని ఐఫోన్ యూజర్లు చెబుతున్నారు. ఈ సమస్య ఐఫోన్ 17 సిరీస్, ఐఫోన్ ఎయిర్‌తో సహా కొత్త మోడళ్లలో కనిపిస్తోంది. మీ ఐఫోన్లలో కూడా ఇదే సమస్య ఉందా?
Tech Tips Telugu
- ఆపిల్ ఐఫోన్లలో బ్యాటరీ సమస్యపై యూజర్ల ఆందోళన
- బ్యాటరీ డెడ్ అయి ఆన్ కావడం లేదంటూ ఫిర్యాదులు
- ఐఫోన్ బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయ్యాక ఆన్ చేయాలంటే ఎలా?
Tech Tips Telugu : ఐఫోన్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మీ ఐఫోన్లో బ్యాటరీ సమస్య ఉందా? చాలామంది ఐఫోన్ యూజర్లు బ్యాటరీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. బ్యాటరీ పూర్తిగా అయిపోయిన వెంటనే తమ ఐఫోన్ అసలు ఆన్ కావడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు.
ఈ సమస్య ఐఫోన్ 17 సిరీస్, ఐఫోన్ ఎయిర్‌తో సహా కొత్త మోడళ్లలో (Tech Tips Telugu) ఎక్కువగా కనిపిస్తోంది. రిపోర్టు ప్రకారం.. ఐఫోన్ 0శాతం బ్యాటరీ వద్ద ఆగిపోతుంది. వెంటనే ఛార్జర్‌ను ప్లగ్ చేసినా ఆన్ అవ్వదు. ఐఫోన్ స్క్రీన్ పూర్తిగా డెడ్ అవుతుంది. ఛార్జింగ్ ఇండికేషన్ కూడా ఏదీ కనిపించదు.
బ్యాటరీ పూర్తిగా అయిపోతే ఏమౌతుంది? :
బ్యాటరీ పూర్తిగా డిఛార్జ్ అయితే ఐఫోన్ వైర్డ్ ఛార్జింగ్‌కు లేదా బటన్ ఇన్పుట్కు వెంటనే రెస్పాండ్ అవ్వదు. మరో USB-C కేబుల్‌ను వాడినా లేదా డివైజ్ మ్యాక్ కు కనెక్ట్ చేసినా లేదా హార్డ్‌వేర్ రీసెట్ చేసినా వర్క్ అవ్వదు.
ఐఫోన్ కొన్ని నిమిషాల పాటు పూర్తిగా ఆఫ్‌లో ఉన్నట్లుగా లేదా ‘డెడ్’ అయినట్లుగా కనిపిస్తుంది. అయితే, ఈ సమస్య ప్రతిసారి రాదు. అన్ని ఐఫోన్లలో ఇలా ఉండకపోవచ్చు. బ్యాటరీ అయిపోయిన తర్వాత ఐఫోన్లు సాధారణంగా ఆన్ అయ్యాయని కొందరు రిపోర్టు చేశారు. దీనిని బట్టి ఈ సమస్య చాలా అరుదైనదిగా చెప్పవచ్చు.
ఈ ట్రిక్ ఓసారి ట్రై చేయండి :
మీ ఐఫోన్‌ను వైర్లెస్ ఛార్జర్‌పై ఉంచి సుమారు 10 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు అలా వదిలేయండి చాలు.. అదే రీఛార్జ్ అవుతుంది. చాలా మంది యూజర్లు తమ ఐఫోన్లను మ్యాగ్‌సేఫ్ ఛార్జర్‌పై కొద్దిసేపు ఉంచాక ఆటోమేటిక్‌గా ఆన్ అయిందని కూడా నివేదించారు.
ఐఫోన్ రీబూట్ అవ్వడానికి ముందు కనీస బ్యాటరీ వోల్టేజ్ అవసరం. బ్యాటరీ లెవల్ ఈ లిమిట్ కన్నా తక్కువకు పడిపోతే తగినంత ఛార్జ్ అయ్యే వరకు డివైజ్ రెస్పాండ్ కాకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో ఐఫోన్ అవసరమైన లెవల్ రావాలంటే వైర్డ్ ఛార్జింగ్ కన్నా వైర్లెస్ ఛార్జింగ్ బెస్ట్ ఆప్షన్.
గుర్తుంచుకోవలసిన విషయాలివే :
ఈ సమస్య తాత్కాలికమే అయినా ఐఫోన్ అత్యవసరమైన సమయాల్లో కొన్నిసార్లు ఇబ్బందిగా మారవచ్చు. వినియోగదారులు ఫోన్ బ్యాటరీ 0 శాతానికి పడిపోకుండా చూసుకోవాలి. అలాగే, వీలైతే, వైర్లెస్ ఛార్జర్‌ను దగ్గర పెట్టుకోవాలి. తద్వారా మీ ఐఫోన్ వెంటనే రీఛార్జ్ చేయవచ్చు.
