Epic Teaser: ‘ఎపిక్’ టీజర్ వచ్చేసింది.. యూత్ ఫుల్ కంటెంట్ తో మరోసారి అదరగొట్టేసిన ‘బేబీ’ జంట
ఎపిక్ టీజర్ (Epic Teaser)లో రొమాంటిక్ కంటెంట్ తో మరోసారి రెచ్చిపోయిన ఆనంద్, వైష్ణవి.
anand deverakonda, vaishnavi chaitanya epic movie teaser released
- ఆనంద్, వైష్ణవి జంటగా ఎపిక్.
- అదిరిపోయిన యూత్ ఫుల్ టీజర్.
- ఆదిత్య హాసన్ మార్క్ మేజిక్.
Epic Teaser: ‘బేబీ’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎపిక్’. ’90’స్ – మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌తో తనదైన ముద్ర వేసిన దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వెంకట్ ఉప్పుటూరి, వి.ఎం.ఆర్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి.
Ranbir-Aditya dhar: మిషన్ ‘మార్చ్’ ఫిక్స్.. రణవీర్ సింగ్ – ఆదిత్య ధర్ క్రేజీ కాంబోలో మరో మూవీ
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్(Epic Teaser)ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ ఆద్యంతం యూత్‌ఫుల్ కంటెంట్‌తో, నేటి తరం ఆలోచనలకు తగ్గట్టుగా కలర్ఫుల్గా సాగింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవిల మధ్య కెమిస్ట్రీ మరోసారి హైలైట్‌గా నిలుస్తుందని టీజర్ స్పష్టం చేస్తోంది. ఆదిత్య హాసన్ మార్క్ ఎమోషన్స్, హ్యూమర్‌తో కూడిన ఈ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ‘బేబీ’ తర్వాత మళ్ళీ వీరిద్దరినీ వెండితెరపై చూడాలని ఆశపడుతున్న అభిమానులకు ఈ టీజర్ ఒక మంచి కిక్ ఇచ్చింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.
