TS 10th Supplementary Exam : పదో తరగతి విద్యార్థులకు బిగ్ అప్డేట్.. సప్లీమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదయ్యింది.. ఎప్పటి నుంచంటే..
TS 10th Supplementary Exam : పదో తరగతి ఫలితాలు విడుదలయిన నేపథ్యంలో తెలంగాణ సర్కార్.. సప్లీమెంటరీ పరీక్ష తేదీలు విడుదల చేసింది.
Telangana Class 10 supplementary exams 2026 dates announced
TS 10th Supplementary Exam : పదో తరగతి ఫలితాల వెల్లడి తర్వాత, ఆశించిన ఫలితాలు సాధించని విద్యార్థుల కోసం విద్యాశాఖ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. వారి విద్యా సంవత్సరం వృథా కాకుండా ఉండేందుకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల క్యాలెండర్ను అధికారికంగా ప్రకటించింది. విద్యాశాఖ షెడ్యూల్ ప్రకారం.. ఈ ప్రత్యేక పరీక్షలు జూన్ 5వ తేదీన మొదలై, జూన్ 12 వరకు జరుగుతాయి. ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. లభించిన ఈ సమయాన్ని ఒక సువర్ణావకాశంగా భావించి, పకడ్బందీగా సిద్ధమై ఉత్తీర్ణులు కావాలని అధికారులు కోరుతున్నారు.
దరఖాస్తుకు ఆఖరి తేదీ
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ 30 నుండి మే 14వ తేదీ లోపు నిర్ణీత ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులకు అవకాశం ఉండదు, కాబట్టి లాస్ట్ డేట్ వరకు ఎదురు చూడకుండా ముందే ఫీజు చెల్లించాలని అధికారులు సూచించారు.
రీకౌంటింగ్
కేవలం ఫెయిల్ అయిన వారే కాకుండా.. వచ్చిన మార్కులపై అనుమానం ఉన్న విద్యార్థులు రీకౌంటింగ్ ప్రక్రియను ఎంచుకోవచ్చు. దీని కోసం ఒక సబ్జెక్టుకు రూ. 500 చెల్లించాలి. ఇందులో మార్కుల లెక్కింపును మరోసారి సరిచూస్తారు.
రీవెరిఫికేషన్
ఒక సబ్జెక్టుకు రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో జవాబు పత్రాల పునఃపరిశీలనతో పాటు, విద్యార్థులు తమ సమాధాన పత్రం (Answer Sheet) యొక్క నకలును కూడా పొందే వీలుంటుంది. మార్కులపై నమ్మకం ఉన్న విద్యార్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అవకాశాన్ని వాడుకోవాలి. సప్లిమెంటరీలో పాస్ అయితే అదే సంవత్సరం పై చదువులకు వెళ్లే వెసులుబాటు ఉంటుంది కాబట్టి, విద్యార్థులు ఆందోళన చెందకుండా ప్రణాళికాబద్ధంగా చదవాలని బోర్డు సూచిస్తోంది.
