WhatsApp Username : వావ్.. వాట్సాప్‌లో కొత్త ‘యూజర్ నేమ్’ ఫీచర్.. మీ ఫోన్ నెంబర్ ఇలా దాచేయండి!
WhatsApp Username : మీరు అన్నౌన్ యూజర్లతో ఇక మొబైల్ నంబర్ షేర్ చేయాల్సిన పనిలేదు. వాట్సాప్ సరికొత్త ప్రైవసీ ఫీచర్ వచ్చేసింది. ఇందులో యూజర్‌నేమ్ ద్వారానే అందరితో కనెక్ట్ అవ్వొచ్చు.
WhatsApp Username
- వాట్సాప్‌లో సరికొత్త ప్రైవసీ ఫీచర్ వచ్చేసింది
- వాట్సాప్ యూజర్లకు ఫోన్ నెంబర్ అవసరం లేదు
- యూజర్ నేమ్ ద్వారానే ఇక చాటింగ్ చేయొచ్చు
- తెలియని వారికి మీ ఫోన్ నెంబర్ కనిపించదు
WhatsApp Username : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై మీ వాట్సాప్ ఫోన్ నెంబర్లతోనే కాదు.. యూజర్ నేమ్‌తో కూడా వాడుకోవచ్చు. యూజర్ల ప్రైవసీ కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్ తీసుకువస్తోంది. ఈ కొత్త అప్ డేట్ అందుకున్న యూజర్లు తమకు నచ్చిన యూజర్ నేమ్ సెట్ చేసుకోవచ్చు.
తద్వారా మీ ఫోన్ నెంబర్ ఇతరులకు కనిపించదు. కేవలం యూజర్ నేమ్ మాత్రమే అందరికి కనిపిస్తుంది. ఫోన్ నెంబర్ షేర్ చేయడం ఇష్టం లేని యూజర్లకు ఈ స్పెషల్ ఫీచర్ అద్భుతంగా ఉంటుంది.
ముఖ్యంగా వాట్సాప్‌లో అన్ నౌన్ యూజర్లతో చాటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు మీ మొబైల్ నంబర్ (WhatsApp Username) సేఫ్ గా ఉంటుంది. యూజర్ నేమ్ ద్వారా మాత్రమే మీరు అందరితో చాట్ చేయగలరు. ఇప్పటివరకూ ఫోన్ నెంబర్ ద్వారా వాట్సాప్ కాంటాక్టుల్లో సెర్చ్ చేసేవారు..
ఇకపై యూజర్ నేమ్ ద్వారా కూడా సెర్చ్ చేయొచ్చు. అంతేకాదు.. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ యాప్‌లలో ఎవరైనా ఆ యూజర్‌నేమ్‌తో మీకు మెసేజ్ చేస్తే.. వారికి మీ పూర్తి ఫోన్ నంబర్ కనిపించదు. మీ యూజర్ నేమ్ మాత్రమే కనిపిస్తుంది. ప్రతి అకౌంట్ ఒక యూజర్‌నేమ్ మాత్రమే ఉంటుంది.
వాట్సాప్ యూజర్లు ఎప్పుడైనా మార్చుకోవచ్చు. చాట్ లేదా అకౌంట్ డేటాకు ఎలాంటి లాస్ ఉండదు. సైన్-ఇన్, రికవరీ కోసం ఫోన్ నంబర్ మీ ఖాతాకు లింక్ అయి ఉంటుంది. కానీ, అది గ్రూప్ చాట్‌లోని చాలా మంది యూజర్లకు లేదా డైరెక్ట్ మెసేజ్ ద్వారా కనెక్ట్ అయ్యే యూజర్లకు కూడా కనిపించదు.
వాట్సాప్ యూజర్‌నేమ్ అర్హతలేంటి? :
మీకు ఈ ఫీచర్ అందుబాటులో ఉందా? లేదో ముందుగా చెక్ చేసుకోవాలి. మీ వాట్సాప్‌లో ప్రొఫైల్ సెట్టింగ్‌లను ఓపెన్ చేయండి. మీకు అర్హత ఉంటే.. యూజర్‌నేమ్‌ను క్రియేట్ చేయండి అంటూ స్పెషల్ ఆప్షన్ కనిపిస్తుంది. స్పెషల్ యూజర్‌నేమ్ హ్యాండిల్‌ను క్రియేట్ చేసేందుకు వాట్సాప్‌లో ప్రస్తుతం ఈ రూల్స్ తప్పనిసరిగా పాటించాలి.
ఉదాహరణకు.. యూజర్‌నేమ్ 3 నుంచి 35 క్యారెక్టర్ల పొడవు ఉండాలి. అందులో కనీసం ఒక లెటర్ ఉండాలి. వాట్సాప్ యూజర్లు స్మాల్ లెటర్స్, నెంబర్స్, డాట్స్, అండర్‌స్కోర్‌లను కూడా ఎంచుకోవచ్చు. అయితే, మీ యూజర్‌నేమ్ అనేది ‘www.’ లేదా ‘.com’ వంటి డొమైన్‌తో ప్రారంభంలో లేదా చివరిలో ఉండకూడదు.
వాట్సాప్ యూజర్‌నేమ్ ఎలా సెటప్ చేయాలి? :
మీ వాట్సాప్ అకౌంట్ అర్హత ఉంటే.. మీ అకౌంట్ యూజర్‌నేమ్ సెటప్ కోసం ఈ కింది విధంగా ఫాలో అవ్వండి.
- మీ ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేయండి
- టాప్ రైట్ కార్నర్లో ఉన్న త్రి డాట్స్ ఐకాన్ ట్యాప్ చేసి సెట్టింగ్‌లను ఎంచుకోండి.
- ఐఫోన్లో స్క్రీన్ దిగువన ఉన్న సెట్టింగ్ ట్యాబ్‌ను ట్యాప్ చేయండి.
- మీ అకౌంట్ వివరాలను ఓపెన్ చేసేందుకు పేజీ పైభాగంలో మీ ప్రొఫైల్ పేరును ఎంచుకోండి.
- ప్రొఫైల్ సెట్టింగ్స్ మెనూలో కనిపించే యూజర్‌నేమ్ ఆప్షన్ ఎంచుకోండి.
- మీ వాట్సాప్ అకౌంట్ కోసం కోరుకునే యూజర్‌నేమ్‌ను ఎంటర్ చేయండి.
- 3 నుంచి 35 క్యారెక్టర్ల పొడవు ఉండవచ్చు.
మీరు సరైన యూజర్‌నేమ్‌ను ఎంటర్ చేశాక వాట్సాప్ చెక్ చేస్తుంది. ఒకవేళ అది అందుబాటులో ఉంటే ఆ యూజర్‌నేమ్ పొందవచ్చు. అంతేకాదు.. ఈ ఫీచర్ పూర్తిగా ఆప్షనల్. అంటే.. మీ ఫోన్ నంబర్‌తో కూడా వాట్సాప్ వాడుకోవచ్చు.
