Today Horoscope 26 April in Telugu : రాశి ఫలాలు 26 ఏప్రిల్.. ఈ రాశి వారు పట్టిందల్లా బంగారమే.. ఈ ఒక్క పని చేస్తే ఇక తిరుగుండదు
Daily horoscope in Telugu : ఆదివారం పలు రాశుల వారికి సానుకూలంగా ఉంది. కొందరికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది.
Horoscope Today 26 April 2026 Sunday Rasi Phalalu Telugu
Today Horoscope 26 April in Telugu : ఏప్రిల్ 26, ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతితో పాటు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన దినోత్సవం కూడా. ఇక ఆదివారం అమృత గడియలు, రాహుకాలం, దుర్ముహూర్తం మరియు 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం..
ముఖ్య సమయాలు:
- అమృత గడియలు: సాయంత్రం 06:01 నుండి రాత్రి 07:38 వరకు.
- రాహుకాలం: సాయంత్రం 04:46 నుండి 06:21 వరకు.
- దుర్ముహూర్తం: సాయంత్రం 04:40 నుండి 05:30 వరకు.
ద్వాదశ రాశి ఫలాలు:
మేష రాశి:
మేష రాశి వారికి ఆదివారం మానసిక ఇబ్బందులు, శ్రమ అధికం. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం.
పరిహారం: శివాలయ దర్శనం శుభప్రదం.
వృషభ రాశి:
ఆదివారం వృషభ రాశి వారికి కోపం అధికంగా ఉంటుంది, పని ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో ఆటంకాలు కలగవచ్చు.
పరిహారం: సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది.
మిథున రాశి:
మిథున రాశి వారికి నేడు పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ధన లాభం, పదవీ యోగాలు సూచిస్తున్నాయి. స్త్రీ అధికారుల మన్ననలు పొందుతారు.
పరిహారం: ఇష్ట దైవారాధన చేస్తే మంచిది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి నేడు ఆదాయానికి మించిన ఖర్చులు, ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ధైర్యంతో సమస్యలను ఎదుర్కోవాలి.
పరిహారం: గణేశ స్తోత్రం పారాయణం చేయండి.
సింహ రాశి:
ఆదివారం సింహ రాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. సర్వత్రా అనుకూలత. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.
పరిహారం: ఇంటి దైవాన్ని ఆరాధిస్తే మంచిది.
కన్య రాశి:
ఆదివారం కన్య రాశి వారికి అంతగా కలిసి రాదు. ఆర్థిక ఇబ్బందులు, ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
పరిహారం: ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించండి.
తులా రాశి:
తులా రాశి వారికి నేడు చాలా బాగుంది. పాత బాకీలు వసూలవుతాయి. కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. విద్యార్థులకు పరీక్షల్లో విజయం లభిస్తుంది.
పరిహారం: ఇష్ట దైవారాధన చేస్తే మంచిది.
వృశ్చిక రాశి:
నేడు వృశ్చిక రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. అభివృద్ధి పథంలో సాగుతారు. రాజకీయంగా అనుకూలం. నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది.
పరిహారం: శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం శుభం.
ధనుస్సు రాశి:
ఆదివారం ధనస్సు రాశి వారికి పనుల యందు ఆలస్యం, బద్ధకం వల్ల ఇబ్బందులు రావచ్చు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.
పరిహారం: పశుపక్ష్యాదులకు ఆహారం పెట్టడం మంచిది.
మకర రాశి:
మకర రాశి వారు ఆదివారం నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అపనిందలు పడే అవకాశం ఉంది. స్నేహితుల విషయంలో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు పెరుగుతాయి.
పరిహారం: ఆదిత్య హృదయం పారాయణం చేయండి.
కుంభ రాశి:
నేడు కుంభ రాశి వారికి సానుకూలంగా ఉంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పాత స్నేహితుల కలయిక ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలిగే అవకాశం ఉంది.
పరిహారం: మీ ఆరాధ్య దైవాన్ని నమ్ముకోండి.
మీన రాశి:
మీన రాశి వారికి ఆదివారం పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది. అధిక లాభాలు, ఆర్థిక స్థితి బాగుంటుంది.
పరిహారం: విష్ణు ఆలయ సందర్శనం ఉత్తమం.
