Patlolla Shashidhar Reddy : కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. బీఆర్ఎస్ లో చేరిన పట్లోళ్ల శశిధర్ రెడ్డి

డబ్బుతో శశిధర్ రెడ్డి మెదక్ ప్రాంతంలో ఎనలేని సేవలు చేశారని వారి కుటుంబం మెదక్ అభివృద్ధికి కృషి చేసిందని కొనియాడారు. శశిధర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరుతున్నారని తెలిపారు.

Shashidhar Reddy

Harish Rao – Shashidhar Reddy : ఎన్నికల వేళ మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలింది. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత పట్లోళ్ల శశిధర్ రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి హరీశ్ రావు సమక్షంలో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఆయనతో పాటు పెద్ద మొత్తంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు గులాబీ పార్టీ గూటికి చేశారు. మంత్రి హరీశ్ రావు వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ పునరాభివృద్ధిలో తాను భాగస్వామ్యం కావాలనే బీఆర్ఎస్ లో చేరినట్లు శశిధర్ రెడ్డి తెలిపారు. 1999లో ఢిల్లీ నుంచి కాంగ్రెస్ టికెట్ ఇచ్చి పంపిస్తే కాంగ్రెస్ కు చెవులే ఉన్నాయని కండ్లు లేవని స్థానికులు అన్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తానని చెప్పారు. కాంగ్రెస్ లో దరఖాస్తు చేసుకున్న వారందరినీ అధిష్టానం విస్మరించిందన్నారు.

Also Read : అంగళ్లు కేసులో చంద్రబాబుకు ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

మొన్న తిరుపతి రెడ్డి చేరిక, నేడు శశిధర్ రెడ్డి
శశిధర్ రెడ్డి మెదక్ ప్రాంతంలో ఎనలేని సేవలు చేశారని హరీష్ రావు తెలిపారు. ఆయన కుటుంబం మెదక్ అభివృద్ధికి కృషి చేసిందని కొనియాడారు. శశిధర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరుతున్నారని తెలిపారు. మొన్న తిరుపతి రెడ్డి చేరిక, నేడు శశిధర్ రెడ్డి చేరికతో హ్యాట్రిక్ ఖాయమైందన్నారు. మెదక్ ప్రజల ఆత్మగౌరవం కొనలేరని తెలిపారు.

మెదక్ అడ్డాలో డబ్బు సంచులు పని చేయవని స్పష్టం చేశారు. ప్రజల మీద ప్రేమ ఉండాలని, ప్రజలకు సేవ చేయాలన్నారు. మెదక్ పుకార్లు తిప్పికొట్టాలి. హ్యాట్రిక్ గెలుపు ఇవ్వాలి అని పిలుపునిచ్చారు. కొందరు డబ్బు సంచులతో వస్తున్నారని మెదక్ ఆత్మ గౌరవాన్ని డబ్బుతో కొనలేరని స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ మాట తప్పారు కానీ, సీఎం కేసీఆర్ వల్ల, పద్మ వల్ల మెదక్ జిల్లా అయ్యింది. మెడికల్ కాలేజీ, రైల్ వచ్చిందన్నారు. ఘన్ పూర్ ఆనకట్ట నీళ్ళు వదలాలని ధర్నాలు చేసే రోజులు లేవని తెలిపారు.

Also Read: కాంగ్రెస్‌కు ఎన్‌ఆర్‌ఐ కష్టం.. ఝాన్సీరెడ్డికి ఆదిలోనే అడ్డంకులు

కేసిఆర్ రెండు పంటలకు నీళ్ళు ఇస్తున్నారని, కరెంట్ నిరంతరం ఇస్తున్నారని పేర్కొన్నారు. దండగ అన్న వ్యవసాయాన్ని పండగ చేసింది కేసీఆర్ అని అన్నారు. పండుగల వేళ ఎన్నికల పండగ వచ్చిందని, రకరకాల వ్యక్తులు వస్తున్నారని చెప్పారు. పెట్టుబడి నాడు రూపాయి లేని పరిస్థితి.. ఇప్పుడు పెట్టుబడి సాయం ఇస్తున్నామని తెలిపారు.

ఉచిత కరెంట్ ను కాంగ్రెస్ ఉత్త కరెంట్ చేసిందని తెలిపారు. రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ చాలు అంటున్నాడు. 3 గంటలు ఇచ్చే వాళ్ళు కావాలా, 24 గంటలు ఇచ్చే వాళ్ళు కావాలా అని ఆలోచించుకోవలన్నారు. ఎండాకాలంలో కూడా పంటకు నీళ్ళు అందుతున్నాయని గుంట కూడా పంట ఎండటం లేదన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు