ఓ వైపు ఇంటి అద్దె భారం.. ఇప్పుడు ఉబెర్ క్యాబ్ ఖర్చులు రూ.16 వేల కన్నా ఎక్కువయ్యాయ్.. యువతి ఆవేదన

ఓ యువతి తన రవాణా ఖర్చులను చెబుతూ చేసిన ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతోంది.

Uber charges

Uber Charges: భారతదేశ ఐటీ రాజధానిగా చెప్పుకునే బెంగళూరులో అన్నింటి ధరలూ భారీగా ఉంటాయి. సామాన్యులు భరించలేనంతగా అక్కడ జీవన వ్యయం ఉంటుంది. ఇంటి అద్దెల ధరలు విపరీతంగా ఉంటాయి. ట్రాఫిక్ కూడా అధికంగా ఉంటుంది. దీంతో బెంగళూరు వాసులు ఉబెర్ క్యాబ్‌లను బాగా వాడుతుంటారు.

తాజాగా ఓ యువతి తన రవాణా ఖర్చులను చెబుతూ చేసిన ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతోంది. తన ఇంటి అద్దె ఎంత కడతానో అందులో సగం కంటే ఎక్కువ డబ్బులు నెల రోజుల్లో ఉబెర్ కి ఖర్చు అయ్యాయని ట్వీట్లో ఆమె చెప్పింది. ఆమె పోస్ట్ చేసిన స్క్రీన్ షాట్ల ప్రకారం జూలై 1 నుంచి 25 మధ్య 74 ఉబెర్ ట్రాన్సాక్షన్లను ఆమె చేసింది. మొత్తం రూ.16,600 ఖర్చు అయింది. ఆమె చేసిన ఈ ట్వీట్ పై అభిమానులు స్పందిస్తూ ఆమెకు పలు సూచనలు చేశారు.

ఈఎంఐలో ఓ బైక్ కొనుక్కోవాలని, ఉబెర్ కోసం చేసే ఖర్చుకన్నా తక్కువే అవుతుందని చెబుతున్నారు. ఉబెర్ కోసం ఇంతగా ఖర్చు చేస్తుంటే అసలు ఇంటి అద్దె కట్టడానికి డబ్బులు మిగులుతున్నాయా? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ఇంటి అద్దెలే అధికంగా ఉంటాయంటే ఉబెర్ ఖర్చు అంతకన్నా ఎక్కువ ఉందేంటని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

Viral Video: ముంబై భారీ వర్షంలో తిరిగిన మార్వెల్ సూపర్ హీరోలు.. వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు