Purushothamudu : ‘పురుషోత్తముడు’ మూవీ రివ్యూ.. రాజ్ తరుణ్ సినిమా ఎలా ఉంది?

సినిమా రిలీజ్ ముందు ట్రైలర్, టీజర్ చూసి శ్రీమంతుడు తరహాలో ఉంటుందని అంతా భావించారు. కానీ..

Raj Tarun Purushothamudu Movie Review and Rating

Purushothamudu Movie Review : రాజ్ తరుణ్, హాసిని శ్రీధర్ జంటగా శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మాణంలో రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పురుషోత్తముడు’. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా.. లాంటి పలువురు స్టార్స్ ఈ సినిమాలో నటించారు. పురుషోత్తముడు సినిమా నేడు జులై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ విషయానికొస్తే.. ఇండియాలోని పెద్ద బిజినెస్ మెన్స్ లో ఒకరైన పరశురామయ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఆదిత్య రామ్(మురళి శర్మ) కొడుకు రచిత్ రామ్(రాజ్ తరుణ్). లండన్ లో చదువుకొని ఇండియాకు రాగానే తన బిజినెస్ లకు కొత్త సీఈఓగా పెట్టాలనుకుంటాడు ఆదిత్య రామ్. కానీ దానికి రచిత్ రామ్ పెద్దమ్మ(రమ్యకృష్ణ) అడ్డు చెప్పి కంపెనీ రూల్స్ ప్రకారం సీఈఓ అవ్వాల్సిన వ్యక్తి ఎవరికీ తెలియకుండా 100 రోజుల పాటు ఓ సామాన్యుడిలా అజ్ఞాత జీవితం గడపాలని గుర్తుచేస్తుంది. రచిత్ రామ్ ఇందుకు ఒప్పుకొని ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాడు.

రచిత్ రామ్ కడియం దగ్గర ఓ పల్లెటూరులో నర్సరీ నడుపుతున్న అమ్ములు(హాసిని సుధీర్) దగ్గర పనిలో చేరుతాడు. అయితే అక్కడ గ్రామంలోని రైతులని స్థానిక ఎమ్మెల్యే ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. అదే సమయంలో రచిత్ రామ్ పెద్దమ్మ, ఆమె కుమారుడు(విరాన్) ఇతను ఎక్కడున్నాడో కనుక్కొని సీఈఓ అవ్వకుండా చేయాలనుకుంటారు. మరి రచిత్ రామ్ తాను ఎవరో ఎవరికీ తెలియకుండా 100 రోజులు గడిపాడా? రచిత్ రామ పెద్దమ్మ, ఆమె కొడుకు ఏం చేసారు? ఊళ్ళో రైతుల కోసం రచిత్ రామ్ ఏం చేసాడు? ఈ మధ్యలో రచిత్ – అమ్ములు ప్రేమ కథేంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Operation Raavan : ‘ఆపరేషన్ రావణ్’ మూవీ రివ్యూ.. సైకో కిల్లర్ ని చివరిదాకా కనిపెట్టలేరు..

సినిమా విశ్లేషణ.. హీరో తన ఆస్తి వదిలి ఏదో ఒక దాని కోసం మాములు జనాల్లో బతకడం అనేది చాలా సినిమాల్లో చూసాం. ఈ సినిమా కూడా అదే కోవలో ఉంటుంది. సినిమా రిలీజ్ ముందు ట్రైలర్, టీజర్ చూసి శ్రీమంతుడు తరహాలో ఉంటుందని అంతా భావించారు. కానీ చూశాక పిల్ల జమిందార్, బిచ్చగాడు.. లాంటి సినిమాలు గుర్తొస్తాయి. ఫస్ట్ హాఫ్ లో హీరో లండన్ నుంచి రావడం, కంపెనీ రూల్స్ ప్రకారం 100 రోజులు ఎవరికీ కనపడకుండా బతకడానికి వెళ్లడం, ఊర్లో హీరోయిన్ దగ్గర చేరడంతో సాగుతుంది. ఇంటర్వెల్ ముందు రైతుల కోసం హీరో ఏ చేసాడు అని సాగే సన్నివేశాలతో ఆసక్తిగా మారుతుంది. సెకండ్ హాఫ్ ఇక రచిత్ రామ్ ని కనిపెట్టేస్తారా? సీఈఓ కాకుండా ఆపుతారా అని ఆసక్తిగా సాగుతుంది.

హీరో – హీరోయిన్ లవ్ సన్నివేశాలు, ప్రవీణ్ తో హీరో చేసే కామెడీ బాగానే వర్కౌట్ అయ్యాయి. ఇలాంటి సినిమాలకు క్లైమాక్స్ ముందే ఊహించేయచ్చు. అయితే రాజ్ తరుణ్ ఇప్పటివరకు చేసిన సినిమాలు, పాత్రలకు ఇది కొంచెం దూరంగా ఉంటుంది. రాజ్ తరుణ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాకి తెరకెక్కించారు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా పురుషోత్తముడు సినిమాని బాగానే తీర్చిదిద్దారు. అసలే రాజ్ తరుణ్ కి ఓ పక్క ఫ్లాప్స్ మరో పక్క పర్సనల్ వివాదాలు వెంటాడుతున్న ఈ సమయంలో పురుషోత్తముడు సినిమా వచ్చింది. మరి ఇది రాజ్ తరుణ్ కి ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఇప్పటి వరకు చేసిన పాత్రలకు డిఫరెంట్ గా రాజ్ తరుణ్ ఈ సినిమాలో కనిపించాడు. ఓ పక్క బాగా డబ్బున్న వాడిలా, మరో పక్క పల్లెటూరిలో బాగానే నటించి మెప్పించాడు రాజ్ తరుణ్. ముంబై భామ హాసిని సుధీర్ అందంతో, నటనతో బాగానే అలరించింది. ప్రవీణ్, బ్రహ్మానందం నవ్వించారు. రాజ్ తరుణ్ పెద్దమ్మ పాత్రలో రమ్యకృష్ణ అదరగొట్టేసింది. విరాన్ ముత్తంశెట్టి నెగిటివ్ పాత్రలో బాగానే నటించాడు. ప్రకాష్ రాజు, మురళీ శర్మ, ముఖేష్ కన్నా, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ.. మిగిలిన నటీనటులంతా వారి పాత్రలకు తగ్గట్టు నటించి మెప్పించారు.

Also Read : Raayan Review : ‘రాయన్’ మూవీ రివ్యూ.. ధనుష్ 50వ సినిమా ఎలా ఉందంటే..?

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం చాలా రిచ్ గా ఉన్నాయి. లొకేషన్స్ కూడా చాలానే వాడారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ పర్వాలేదనిపిస్తాయి. కథ, కథనం రెండూ పాతవే. రామ్ భీమనకు ఇది మూడో సినిమా కాబట్టి దర్శకుడిగా మరోసారి మెప్పించాడు. నిర్మాణ పరంగా రాజ్ తరుణ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో కథకు తగ్గట్టు ఎక్కువగానే ఖర్చుపెట్టి క్వాలిటీ సినిమా చూపించారు.

మొత్తంగా ‘పురుషోత్తముడు’ సినిమా కంపెనీ సీఈఓ అవ్వడానికి ఓ డబ్బున్న కుర్రాడు ఎలాంటి కష్టాలు పడ్డాడు అని ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చూపించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక: ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు