కాళేశ్వరం కట్టినప్పుడు, కూలినప్పుడు కేసీఆరే సీఎం- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు NDSA అనుమతి వచ్చే వరకు మేము నీరు నిల్వ చేయం.

Minister Uttam Kumar Reddy : కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ గోబెల్స్ ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయం 35 వేల కోట్లతో స్టార్ట్ చేసి 94 వేల కోట్లు ఖర్చు చేశారని ఆయన తెలిపారు. కాళేశ్వరం పూర్తి కావాలంటే లక్ష 40 వేల కోట్లు అవుతుందన్నారు. క్యాపిటల్ పెట్టుబడి ఇలా ఉంటే.. రన్నింగ్ పెట్టుబడి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. రీ డిజైన్ చేసిన కాళేశ్వరంకు అన్ని పంపులు నడిస్తే ప్రతి ఏటా కరెంటు బిల్లుల ఖర్చు 10 వేల కోట్లు వస్తుందన్నారు. నాన్ బ్యాంకింగ్ ల నుంచి ఎక్కువ వడ్డీలకు కేసీఆర్ అప్పులు తీసుకున్నారని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో నీటి పారుదల శాఖను తీవ్రంగా దెబ్బతీశారని వాపోయారు.

”95 వేల కోట్లు ఖర్చు చేస్తే కొత్త ఆయకట్టు 93 వేల ఎకరాలు. కట్టినప్పుడు, కుంగినప్పుడు కేసీఆరే సీఎం. మళ్ళీ తప్పును మా మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నాసిరకం డిజైన్, నిర్మాణం అని NDSAనే చెప్పింది. నీరు నిల్వ చేయవద్దని లిఖిత పూర్వకంగా NDSA చెప్పింది. కేటీఆర్ కంటే NDSA అధికారులే నిపుణులని మేము భావిస్తున్నాం. అందుకే NDSA బృందం సూచనల ప్రకారం ముందుకు వెళ్తున్నాం. బ్యారేజీకి ప్రమాదం జరిగితే సమ్మక సారక్క బ్యారేజీ.. సీతారామ బ్యారేజీ.. భద్రాచలం పూర్తిగా కొట్టుకుపోతాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల గేట్లు తెరిచే పెడతాం. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి పంపింగ్ రెండు మూడు రోజుల్లో ప్రారంభిస్తాం.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు NDSA అనుమతి వచ్చే వరకు మేము నీరు నిల్వ చేయం. అన్నారం పంపింగ్ 11 మీటర్ల నుంచి ప్రారంభం అవుతుంది. కానీ ఐదు మీటర్లకే బుంగలు పడ్డాయి. సుందిళ్లలో 9 మీటర్ల నుంచి పంపింగ్ అవకాశం ఉంటుంది. కానీ 5 మీటర్లకు బుంగలు పడ్డాయి. నీళ్ళు నిల్వ చేయవద్దని అప్పుడే కేసీఆర్ చెప్పారు. వాళ్ళే నీళ్ళు కిందకు వదిలారు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనం కోసం నీళ్లు నిల్వ చేసి, పంపింగ్ చేయాలని అంటున్నారు. NDSA క్యాటలజికల్ గా కుంగింది. బుంగలు పడ్డాయని చెప్పింది.

దేశంలో డ్యాం సేఫ్టీ నిపుణులు ఆరుగురితో కమిటీ వేసింది. మేడిగడ్డ నుంచి నీరు పంపు చేసి ఎక్కడ పోయాలి..? అన్నారంలో పోయాల్సి ఉంటుంది. అన్నారంలో నీరు నిల్వ ఉంచవద్దని ఎన్.డి.ఎస్.ఏ చెప్పింది. ఇక కేటీఆర్ చెప్పినట్లు నీరు ఎక్కడ లిఫ్ట్ చేయాలి. ఆయన అవగాహన బయట పడుతుంది. మాకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవు” అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు.

Also Read : ఒకే ఒరలో మూడు కత్తులు..! పటాన్‌చెరులో కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు

 

ట్రెండింగ్ వార్తలు