కేసీఆర్‌ను బ‌ద‌నాం చేయాలనే కుట్రలను ఆపండి.. ఆగస్టు 2 వరకు గడువు ఇస్తున్నాం : కేటీఆర్

10లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వెళ్లడం మా కళ్లారా చూశాం. కానీ, పైనఉన్న ప్రాజెక్టులు నీళ్లులేక చూసి బాధపడుతున్నాం.

KTR

KTR : రాజకీయ కక్షతో కేసీఆర్ ను బద్నాం చేయాలనే పంపులను ఆన్ చేయడం లేదు. రాజకీయాలకోసం ప్రజలను, రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ ను కేటీఆర్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ కల్పతరువు అన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులం ప్రాజెక్టును పరిశీలించామని చెప్పారు. ఏ ప్రభుత్వం చేయనంత వేగంగా ప్రాజెక్టు పూర్తిచేశాం. తెలంగాణలో కరువు అనే మాట వినపడవద్దనే సంకల్పంతో ప్రాజెక్టు నిర్మించామని కేటీఆర్ అన్నారు.

Also Read : ఇండియా కూటమిలో జగన్ చేరబోతున్నారన్న వార్తలపై యనమల ఆసక్తికర వ్యాఖ్యలు

రెండు జీవనదుల నుంచి నీటిని తీసుకోవాలని బహుళార్థక ప్రాజెక్టు నిర్మించాం. రెండు రోజులు కేసీఆర్ ఆదేశం మేరకు ఎగువ గోదావరి నుంచి దిగువ వరకు పర్యటించామని కేటీఆర్ తెలిపారు. లోయర్, మిడ్ మానేరులో, శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్టుల్లో తక్కువ నీటినిల్వ ఉంది. బాబ్లీ ప్రాజెక్టు నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. లక్ష్మి పంప్ హౌజ్ నుండి నీళ్లు ఎత్తిపోయవచ్చు అని అధికారులను అడిగాం. నీటిని అందించడం లేదని రైతులు బాధపడుతున్నారని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న సంఘటనను భూతద్దంలోపెట్టి చూస్తున్నారు. రాజకీయం చేయకుండా నీళ్లు అందించాలని కోరుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ కోరారు.

Also Read : ఒకే ఒరలో మూడు కత్తులు..! పటాన్‌చెరులో కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు

10లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వెళ్లడం మా కళ్లారా చూశాం. కానీ, పైనఉన్న ప్రాజెక్టులు నీళ్లులేక చూసి బాధపడుతున్నాం. ప్రభుత్వానికి వాడుకునే తెలివి లేదు. 17 పంపులు పని చేస్తున్నాయి. రాజకీయ పరమైన నిర్ణయం లేకపోవడంవల్ల అధికారులు ఏమి చేయలేకపోతున్నారు. కేసీఆర్ ను బదునాం చేయాలనే పంపులు నడపడం లేదు. ఆరు నెలలు రాజకీయం చెద్దాం. నాలుగున్నరేళ్లు అభివృధ్ధికోసం పాటుపడుదామని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ ప్రాజెక్టులకు వేరే మార్గం ద్వారా నీళ్లువచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. నీటిని లిఫ్ట్ చేయాలని కేటీఆర్ కోరారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నాం. అసెంబ్లీలో నిలదీస్తాం. ఆగష్టు 2వ తేదీ తర్వాత 50వేల మంది రైతులతో కలిసి వెళ్లి మేమే పంపులు ఆన్ చేస్తామని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ట్రెండింగ్ వార్తలు