ఇండియా కూటమిలో జగన్ చేరబోతున్నారన్న వార్తలపై యనమల ఆసక్తికర వ్యాఖ్యలు

. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇండియా కూటమికి దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జగన్ కు ఢిల్లీ స్థాయిలో ..

ఇండియా కూటమిలో జగన్ చేరబోతున్నారన్న వార్తలపై యనమల ఆసక్తికర వ్యాఖ్యలు

Yanamala Ramakrishnudu,

YS Jagan Mohan Reddy : ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ లాబీల్లో నేతల మధ్య ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. తాజాగా అసెంబ్లీ లాబీల్లో టీడీపీ సీనియర్ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు విడివిడిగా మీడియాతో చిట్ చాట్ మాట్లాడారు. యనమల మాట్లాడుతూ.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇండియా కూటమికి దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జగన్ కు ఢిల్లీ స్థాయిలో షెల్టర్ కావాలి. ఇండియా కూటమికి కూడా పార్టీలు కావాలి. జగన్ ధర్నాకు ఇండియా కూటమి పార్టీలు రావడమే దీనికి సంకేతం అని యనమల అన్నారు.

Also Read : Kargil Vijay Diwas 2024 : ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు.. కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులర్పించిన ప్రధాని మోదీ

ఇండియా కూటమిలో చేరడం జగన్ కు అనివార్యం. ఇన్నాళ్లూ బీజేపీని అడ్డం పెట్టుకొని జగన్ పబ్బం గడుపుకున్నారు. ఇప్పుడు ఎన్డీయేలో మేము, జనసేన పార్టీ ఉన్నాం. ఎన్డీయే కూటమిలోకి జగన్ రాలేని పరిస్థితి. షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. కూటమి పార్టీగా జగన్ ఇండియాలో భాగస్వామిగా ఉండబోతున్నారంటూ యనమల పేర్కొన్నారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. ఇండియా కూటమిలో చేరేంత ధైర్యం జగన్ మోహన్ రెడ్డికి ఉందా అంటూ ప్రశ్నించారు. అంత సాహసం చేస్తాడని అనుకోవడం లేదని అన్నారు.

Also Read : CM Jagan : షర్మిలతో రాజీపడతారా, బీజేపీని ఎదిరించి ఇండియా కూటమితో జతకడతారా.. వైఎస్ జగన్ దారెటు?