Jitender Reddy : మొన్న కౌంటర్లు, ఈరోజు కౌగిలింతలు.. జితేందర్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో ఈటలతో పాటు బీజేపీ నేతల మీటింగ్ అందుకేనా..?

నిన్న మొన్నటి వరకు కౌంటర్లు వేసుకున్న నేతలు ఈరోజు కౌగిలింతలతో కనిపించారు. జితేందర్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో ఈటలతో పాటు బీజేపీ నేతల మీటింగ్ ఎందుకు? తెలంగణ బీజేపీలో ఏం జరుగబోతోంది..?

Etala Rajender Lunch meeting with Jitender Reddy Farm House

Jitender Reddy – Etala Lunch meet : తెలంగాణ బీజేపీ (Telangana BJP)లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు కౌంటర్లు వేసుకున్న నాయకులు ఈరోజు కౌగిలించుకుంటున్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి (Jithender Reddy) ఇటీవల ట్విట్టర్ వేదికగా దున్నపోతును తన్నిన వీడియో షేర్ చేసి ఇటువంటి ట్రీట్ మెంట్ కావాలి అంటూ చేసిన పోస్టు వివాదంగా మారింది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) కౌంటర్ ఇచ్చారు. వయస్సు అనుభవం ఉన్న నేతలు ఏది పడితే అది మాట్లాడవద్దు.. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలి. ఇతరుల స్వేచ్చ, గౌరవం తగ్గించకూడదు అంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల్లో ఇటువంటి పరిస్థితి మంచిదికాదని అధిష్టానం కూడా భావిస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరూ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.

Eatala Rajender : వయసు, అనుభవం ఉన్నవారు ఏది పడితే అది మాట్లాడొద్దు : జితేందర్ రెడ్డికి ఈటల కౌంటర్

జితేందర్ రెడ్డి తన ఫామ్ హౌజ్‌లో ఈటలతో భేటీ అయ్యారు. వీరితో పాటు ఇంకా పలువురు బీజేపీ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు కౌంటర్లు ఇచ్చుకున్న ఈటల, జితేందర్ రెడ్డిలు నవ్వుతు కౌగలించుకున్నారు. సోషల్ మీడియాలో జరిగిన వార్‌కు తెరదించేందుకు ఈ భేటీ జరిగిందనేలా ఉంది. పైగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు అనే వార్తలు వస్తున్న క్రమంలో ఈ అనూహ్య సమావేశం ఆసక్తికరంగా మారింది. జితేందర్ రెడ్డి, ఈటల సమావేశానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కూడా హాజరయ్యారు. ఇంకా విజయశాంతి, గరికపాటి, చాడా సురేశ్ రెడ్డి తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

తెలంగాణ బీజేపీ పరిస్థితిపై ఇటీవల ఢిల్లీలో అధిష్టానం కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కె.లక్ష్మణ్, కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలోని బీజేపీ పరిస్ధితి, అధ్యక్ష పదవి మార్పు అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించాలనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మరి ఈ సుదీర్ఘ చర్చలు అనంతరం ఎటువంటి మార్పులు జరుగుతాయో వేచి చూడాలి.

Jithender Reddy : దున్నపోతు ట్రీట్‌మెంట్ అంటూ ట్వీట్ చేసిన మాజీ ఎంపీ .. బీజేపీలో పెను దుమారం

ట్రెండింగ్ వార్తలు