Free Petrol : వాహనదారులకు బంపర్ ఆఫర్.. హైదరాబాద్‌లో పెట్రోల్ ఫ్రీ, మీకు కావాలంటే వెంటనే ఇలా చేయండి..

హైటెక్ సిటీ సమీపంలోని లెమన్ ట్రీ దగ్గరున్న ఇండియన్ ఆయిల్ బంకుతో పాటు ఐకియా స్టోర్స్ సమీపంలోని బంకులో ఈ ఆఫర్ ఉంది. Free Petrol

Free Petrol

Hyderabad Free Petrol : అసలే పెట్రోల్ ధరలు భగభగ మండిపోతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర ఎప్పుడో సెంచరీ దాటేసింది. ఇంకా వాటి ధరల పరుగు కొనసాగుతూనే ఉంది. పెరిగిపోతున్న ఇంధన ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. వామ్మో అని గుండె పట్టుకుంటున్నారు. వాహనాలను రోడ్డు మీకు తీసుకురావాలంటేనే వణికిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్ ఫ్రీ గా ఇస్తారు అంటే నమ్ముతారా? కానీ ఇది నిజమే. ఈ రోజుల్లో పెట్రోల్ ఫ్రీగా ఇస్తారంటే ఎలా నమ్మాలి? అనే ధర్మ సందేహం మీకు రావొచ్చు.

మ్యాటర్ లోకి వెళితే పెట్రోల్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇది నిజమే. ఎక్కడో తెలుసా? హైదరాబాద్ లో. ఎవరు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారో తెలుసుకుందాం.

దేశంలో వేస్ట్ ప్రాబ్లమ్ బాగా పెరిగిపోయింది. ఎక్కడ పడితే అక్కడ వేస్ట్ పడేస్తుంటారు. కొందరు అందులో కావాల్సినవి ఏరుకుని జీవిస్తుంటారు. అయినా, ఇంకా చాలా ప్లాస్టిక్ వేస్ట్ పర్యావరణానికి తీవ్ర హాని చేస్తోంది. అందుకే పర్యావరణ పరిరక్షణ కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ముందుకొచ్చింది. ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వేస్ట్ తీసుకుని పెట్రోల్ ఫ్రీగా ఇస్తున్నారు. దీంతో చాలామంది పనికిరాని వస్తువులు తీసుకొచ్చి పెట్రోల్ నింపుకుంటున్నారు.

Also Read..Mobile Charger : గుండెలు పిండే తీవ్ర విషాదం.. ఫోన్ ఛార్జర్ పిన్ నోట్లో పెట్టుకుని 8నెలల చిన్నారి మృతి, తల్లిదండ్రులూ బీకేర్ ఫుల్

హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని లెమన్ ట్రీ దగ్గరున్న ఇండియన్ ఆయిల్ బంకుతో పాటు ఐకియా స్టోర్స్ సమీపంలోని బంకులో ఈ ఆఫర్ ఉంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 ఐఓసీ పెట్రోల్ బంక్, మియాపూర్, బేగంపేట్, ప్రకాశ్ నగర్ లోనూ వేస్ట్ తీసుకొచ్చి పెట్రోల్ పోయించుకుంటున్నారు. పనికిరాని కాగితాలు, ప్లాస్టిక్, అట్టపెట్టెలు తీసుకొచ్చి లీటర్ పెట్రోల్ ఉచితంగా పోయించుకుంటున్నారు.

దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. రోజుకు 10 నుంచి 15మంది వరకు ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వేస్ట్ తీసుకొచ్చి పెట్రోల్ పోయించుకుంటున్నారు. పది కిలోల వేస్ట్ మేటీరియల్ కు లీటర్ పెట్రోల్ ఫ్రీగా ఇస్తున్నారు. పాడైపోయిన కేబుల్ వైర్లు, మొబైల్స్, ల్యాప్ టాప్ లు వంటి వేస్ట్ తీసుకొచ్చి పెట్రోల్ ఫ్రీగా పోందే అవకాశం కల్పించింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రకటించిన ఈ ఆఫర్ ను మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతిపాదించింది.

Also Read..Rs 2000 Notes: 2వేల నోట్లు మీ దగ్గర ఇంకా ఉన్నాయా? ఆర్‌బీఐ మరో కీలక ప్రకటన చేసింది

డ్రై వేస్ట్ (ప్లాస్టిక్, పేపర్, కార్టన్స్).. ఈ-వేస్ట్ (మొబైల్స్, ల్యాప్ టాప్స్, కేబుల్స్), దాంతో పాటు నెట్ వర్కింగ్ ఎక్విప్ మెంట్.. ఇలాంటి మెటీరియల్ ను మాత్రమే తీసుకుంటామని ఐవోసీ ప్రతినిధులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు