JubileeHills Gang Rape Case : జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు.. ఆ ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్ తప్పదా?

తప్పు చేయకపోతే ఎందుకు దాక్కుంటున్నాడు? నా కొడుకు తప్పు చేయలేదు అంటూ ఆ ఎమ్మెల్యే ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఆ పార్టీ వాళ్లు కూడా ఎందుకు మాట్లాడటం లేదు?

JubileeHills Gang Rape Case : ఆ ఎమ్మెల్యే కొడుకు ఎక్కడ? బీజేపీ బయటపెట్టిన వీడియోల్లో ఉన్నది అతడేనా? బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడా? అరెస్ట్ తప్పదనే అజ్ఞాతంలో ఉన్నాడా? తప్పు చేయకపోతే ఎందుకు దాక్కుంటున్నాడు. కనీసం మీడియా ముందుకొచ్చి వివరణ ఇవ్వలేడా? నా కొడుకు తప్పు చేయలేదు అంటూ ఆ ఎమ్మెల్యే ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఆ పార్టీ వాళ్లు కూడా ఎందుకు మాట్లాడటం లేదు?

హోంమంత్రి మనవడిపై ఆరోపణలు వస్తే.. అతడు మీడియాకు వివరణ ఇచ్చుకున్నాడు. తన తప్పేమీ లేదని, పోలీసుల విచారణకు సహకరిస్తానని ముందుకొచ్చాడు. ఇదే పని ఎమ్మెల్యే కొడుకు కానీ, అతడి తండ్రి కానీ ఎందుకు చేయలేకపోతున్నారు. ఇంతకీ అతడు ఇండియాలోనే ఉన్నాడా? విదేశాలకు వెళ్లిపోయాడా? ఇలా ఎన్నో ప్రశ్నలు ముసురుకుంటున్నాయి.

జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కానీ, ఈ కేసుకి ఇక్కడితో ఎండ్ కార్డ్ పడేలా కనిపించడం లేదు. తప్పు చేసింది ఐదుగురే అని ఖాకీలు చెబుతున్నా.. విపక్షాలన్నీ ఇంకో యువకుడి వైపు వేలు చూపిస్తున్నాయి. అతడిని కాపాడే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాయి.

JubileeHills Gang Rape Case : జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు.. మిగతా ఇద్దరూ అరెస్ట్

అతడు ఓ ఎమ్మెల్యే కొడుకు. బాలికపై అఘాయిత్యం చేసిన వాళ్లలో ఆ యువకుడూ ఉన్నాడంటూ బీజేపీ నేతలు మొదట్నుంచి ఆరోపిస్తున్నారు. పోలీసులు అతడిని తప్పస్తున్నారంటూ ఆందోళనలు చేస్తున్నారు. అయితే వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ మాత్రం ఈ కేసులో ఆ ఎమ్మెల్యే కొడుక్కి ఎలాంటి సంబంధం లేదని స్టేట్ మెంట్ కూడా ఇచ్చేశారు. కానీ, కథ అక్కడితో ముగిసిపోలేదు.

ఆ మరుసటి రోజే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియా ముందుకు వచ్చారు. ఓ వీడియోను రిలీజ్ చేశారు. బెంజ్ కారులో బాధిత యువతితో ఎమ్మెల్యే కొడుకు అసభ్యకర స్థితిలో ఉన్న వీడియోలను బయటపెట్టాడు. ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయడానికి ఇంతకంటే ఏ ఆధారాలు కావాలంటూ పోలీసులను ప్రశ్నించారు. దీంతో ఇప్పుడు అందరి కళ్లు ఖాకీల వైపు చూస్తున్నాయి. ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేస్తారా? చేయరా? అసలు ఆ వీడియోలో ఉన్నది అతడో కాదో ఎందుకు చెప్పడం లేదన్న అనుమానాలు కలుగుతున్నాయి.

మరోవైపు బెంజ్ కార్ వీడియో చూశాక పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎమ్మెల్యే కొడుకు వైపు తిరిగినట్టు తెలుస్తోంది. అతడిని కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అంతకంటే ముందు మరోసారి బాధితురాలి స్టేట్ మెంట్ తీసుకోవాలని పోలీసులు అనుకుంటున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కొడుకు పేరుని ఎఫ్ఐఆర్ లో ఏ-6గా పెట్టే అవకాశం ఉంది.

Hyderabad Gang Rape : గ్యాంగ్ రేప్ ఘటనపై సీబీఐతో గానీ..లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి : రఘునందన్ రావు

ఇక ప్రతిపక్షాలు మాత్రం ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయకుండా పోలీసులపై ఒత్తిళ్లు ఉన్నాయంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే పోలీసులపై ప్రెజర్ పెడుతున్నది ఎవరు? మరోవైపు ఘటన జరిగిన రోజు బేకరీ దగ్గర ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడు. ఆ తర్వాత ఫోన్ కాల్ రావడంతో అతడు వెళ్లిపోయాడు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. బీజేపీ బయటపెట్టిన వీడియోలోనూ అతడు కనిపించాడు. ఆ రోజు అతడు ఏ తప్పూ చేయకపోతే ఎందుకు దాక్కుంటున్నాడు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే కొడుకు హైదరాబాద్ లోనే ఉన్నాడో లేడో కూడా క్లారిటీ లేదు. అతడిని ఇప్పటికే విదేశాలకు పంపించారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు