KA Paul: ఆ ఎమ్మెల్యేని ఈ తొమ్మిదేళ్లలో నేను ఏనాడూ శపించలేదు.. ఇక క్షమించను: కేఏ పాల్

వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినా తానే ముఖ్యమంత్రినని చెప్పారు. కేసీఆర్ మంత్రివర్గంలోని చాలా మంది మంత్రులు తనతో టచ్ లో ఉన్నారని అన్నారు.

KA Paul

KA Paul – Jagga Reddy: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ఈ తొమ్మిది ఏళ్లలో తాను ఏనాడూ శపించలేదని ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆయనను ఆహ్వానిస్తున్నానని చెప్పారు. సంగారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. తాను జగ్గారెడ్డిని ఇప్పటి వరకు క్షమిస్తూ వచ్చానని.. ఇక నుంచి క్షమించనని స్పష్టం చేశారు.

వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీలో చేరుతారా? లేదా అభివృద్ధి చేసే ప్రజా శాంతి పార్టీలో చేరుతారా? అని కేఏ పాల్ అన్నారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా (Sangareddy district) సదాశివపేటలో తాను 1,200 ఎకరాల్లో చారిటీ సిటీ కట్టానని చెప్పారు. చారిటీ సిటీని చూసి దేశ విదేశ ప్రతినిధులు చూసి ఆశ్చర్యపోయారని తెలిపారు. సంగారెడ్డిలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారని అన్నారు.

అప్పట్లో వైఎస్సార్ కి డబ్బులు ఇవ్వనందుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డితో గొడవ చేయించి తన చారిటీని మూయించారని కేఏ పాల్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినా తానే ముఖ్యమంత్రినవుతానని చెప్పారు. పొత్తులు పెట్టుకోవడానికి ఇతర పార్టీలు తన దగ్గరికి వస్తున్నాయని అన్నారు. తనకు మాత్రం అటువంటి ఆలోచలేదని చెప్పారు.

మంత్రి మల్లారెడ్డి భూములు కబ్జా చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నా రేవంత్ కి పీసీసీ పదవి ఇచ్చారని చెప్పారు. ఆర్ఎస్ఎస్ వాళ్లే రేవంత్ ని టీపీసీసీ చీఫ్ ని చేశారని అన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలోని చాలా మంది మంత్రులు తనతో టచ్ లో ఉన్నారని చెప్పారు.

Buddha Venkanna : చంద్రబాబుది గాంధీ సిద్ధాంతం, లోకేష్ ది భగత్ సింగ్ సిద్ధాంతం : బుద్ధా వెంకన్న

ట్రెండింగ్ వార్తలు