BJP Telangana: కాషాయ దళంలో హీట్‌పుట్టిస్తోన్న కిషన్ రెడ్డి, సంజయ్ వైఖరి!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి విముఖత చూపుతున్నారనే సమాచారం తెలంగాణ బీజేపీలో హీట్ పుట్టిస్తోంది.

kishan reddy, bandi sanjay likely to contest lok sabha

Telangana BJP : తెలంగాణ బీజేపీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Elections 2023) దగ్గరపడుతుంటే ముఖ్య నేతలు పార్లమెంట్‌కు పోటీ అంటూ యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. అధిష్టానం తొందరపెడుతున్నా.. ఏవేవో సాకులు చెబుతూ తాము మాత్రం పార్లమెంట్‌కే పోటీ అంటున్నారట బీజేపీ బడా లీడర్లు. రాష్ట్ర బీజేపీకి పెద్ద దిక్కుగా మారిన అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy), మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అసెంబ్లీ సమరం నుంచి పక్కకు తప్పుకుంటామనడం కాషాయ దళంలో హీట్‌పుట్టిస్తోంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి విముఖత చూపుతున్నారనే సమాచారం తెలంగాణ బీజేపీలో హీట్ పుట్టిస్తోంది. గత ఎన్నికల్లో కిషన్‌రెడ్డి అంబర్‌పేట నుంచి.. సంజయ్ కరీంనగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్, కరీంనగర్ నుంచి ఇద్దరూ ఎంపీలుగా గెలిచారు. కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా.. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కీలకంగా వ్యవహరించారు. కొద్ది రోజుల క్రితం బండి స్థానంలో కిషన్‌రెడ్డికి స్టీరింగ్ అప్పగించింది కమలదళం. మరో మూడు నెలల్లో జరిగే ఎన్నికలకు క్యాడర్‌ను సమాయత్తం చేయాలని కిషన్‌రెడ్డిని ఆదేశించింది హైకమాండ్.

ఇక ఎన్నికలకు రోజులు దగ్గరపడుతుండటంతో అభ్యర్థుల ఎంపికపై దృష్టిపెట్టిన అధిష్టానం. ఈ ఇద్దరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై ఆరా తీసిందని చెబుతున్నారు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా.. ఆయన వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చాలా నియోజకవర్గాలు ప్రచారంలోకి వచ్చాయి. అదేవిధంగా కిషన్‌రెడ్డి మళ్లీ అంబర్‌పేట నుంచే పోటీ చేస్తారా? లేక సిటీలో మారో నియోజకవర్గానికి మారతారా? అన్నది చర్చనీయాంశమైంది. ఈ విషయంలో క్లారిటీ కోసం అధిష్టానం ఈ ఇద్దరిని సంప్రదిస్తే.. వారు ఇచ్చిన సమాధానంతో అధిష్టానం పెద్దలు కంగుతిన్నారని చెబుతున్నారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ మళ్లీ ఎంపీగానే పోటీ చేస్తామని చెప్పడం పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది.

Also Read: పార్టీ మారడం ఖాయం.. కాంగ్రెస్ టికెట్‌కోసం దరఖాస్తు చేసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే

ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తేనే మంచిదని…
ఈ ఇద్దరు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తేనే మంచిదని అధిష్టానం భావిస్తుండగా, ఇద్దరు వేర్వేరు కారణాలతో పార్లమెంట్‌పైనే మక్కువ ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ కన్నా లోక్‌సభకు పోటీ చేస్తేనే తాము విజయం సాధిస్తామని చెబుతున్నారు కిషన్‌రెడ్డి, సంజయ్. కరీంనగర్‌ అసెంబ్లీ పరిధిలో మైనార్టీ ఓట్లు తనకు ప్రతికూలంగా మారతాయని సంజయ్ భయపడుతున్నట్లు చెబుతున్నారు. రెండుసార్లు ఎదురైన పరాభవంతో మళ్లీ అక్కడి నుంచి పోటీకి విముఖత ప్రదర్శిస్తున్నారు సంజయ్. అదే పార్లమెంట్ ఎన్నికలైతే ఏడు నియోజకవర్గాల ఓట్లతో సునాయాశంగా గెలుస్తానని.. మోదీ ఇమేజ్‌తోపాటు తన చరిష్మా కూడా వర్క్‌వుట్ అవుతుందని సంజయ్ అంచనా.

Also Read: వారితో మాట్లాడిన తరువాతే కార్యాచరణ ప్రకటిస్తా.. తన కొడుక్కే సపోర్ట్ చేస్తానన్న మైనంపల్లి

కిషన్‌రెడ్డి కూడా ఎంపీగా గెలిచి మళ్లీ కేంద్ర మంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఈ ఇద్దరు నేతలను అసెంబ్లీకే పోటీ చేయాలని అధిష్టానం తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నా.. వారి వైఖరి మాత్రం మారడం లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యనేతలు ఇద్దరూ అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవడం అంటే పార్టీకి ప్రతికూలంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు కార్యకర్తలు. ఇక అధిష్టానం గట్టిగా చెబితేకాని కిషన్‌రెడ్డి, సంజయ్ వైఖరిలో మార్పు రాదంటున్నారు. దీంతో బీజేపీ పెద్దలు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు.. ఇద్దరిని ఒప్పిస్తారా, లేదా అన్నదే పెద్ద చర్చకు దారితీస్తోంది.Te

ట్రెండింగ్ వార్తలు