KTR: మీ దగ్గర నేర్చుకోవాలా? ఆ అవసరం మాకు లేదు: కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీకి 100, కాంగ్రెస్‌కి 40 స్థానాల్లో అభ్యర్థులు లేరని కేటీఆర్ ఆరోపించారు.

KTR

Assembly Elections 2023: సంస్కారం గురించి కాంగ్రెస్ నేతల దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

జానారెడ్డి సంస్కారాన్ని ముందు వాళ్ల పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి నేర్పించాలని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ నేతల సంస్కారం ఏమైందని నిలదీశారు. రేవంత్ రెడ్డి డబ్బులు అసలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలే ఈడీకి ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీకి 100, కాంగ్రెస్‌కి 40 స్థానాల్లో అభ్యర్థులు లేరని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పారు. పీసీసీ పదవిని కాంగ్రెస్ రూ.50 కోట్లకు అమ్ముకుందని అన్నారు.

గత ఎన్నికల్లో తాము సాధించిన సీట్ల కంటే ఇప్పుడు అధి స్థానల్లో గెలుస్తామని చెప్పారు. కేసీఆర్ మూడో సారి సీఎం అవుతారని అన్నారు. ఎన్నికల నుంచి కిషన్ రెడ్డి పారిపోయారని విమర్శించారు. కాగా, తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో కిషన్ రెడ్డి పేరు లేదు.

Assembly Elections 2023: ఛత్తీస్‌గఢ్‭లో కాంగ్రెస్, బీజేపీలకు ఒకేసారి పెద్ద షాక్ ఎదురైంది

ట్రెండింగ్ వార్తలు