Gangula Kamalakar : ఆంధ్రావాళ్లు వస్తున్నారు..ఎన్నికలప్పుడు వచ్చేవారిని నమ్మొద్దు : గంగుల కమలాకర్

బీఆర్ఎస్ కు ఓట్లు వేసి మరోసారి అధికారంలోకి తీసుకురావాలని..అధికారం ఢిల్లీ చేతుల్లోకి వెళ్లకుండా ఉండాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయండీ అంటూ పిలుపునిచ్చారు. అధికారం కేసీఆర్ చేతుల్లో పెడితే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.తెలంగాణ యువత భవిష్యత్తును కేసీఆర్ మాత్రమే కాపాడగలరని..మూడోసారి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Gangula Kamalakar

Minister Gangula Kamalakar : ఆంద్రా వాళ్ళు కాంగ్రెస్ ముసుగుతో వచ్చి తెలంగాణాను ఆంధ్రాలో కలపాలని చూస్తున్నారు అంటూ మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో మంత్రి గంగుల మాట్లాడుతు..కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మవద్దని వారిని నమ్మితే తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తారు అంటూ వ్యాఖ్యానించారు. కరీంనగర్ లోనే నన్ను మూడు సార్లు గెలిపించారు..మరోసారి అవకాశం ఇవ్వండి కరీంనగర్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్ అభివృద్ధి చెందాలంటే  బీఆర్ఎస్ కు ఓటు వేయండి అంటూ పిలుపునిచ్చారు.అధికారం ఢిల్లీ చేతుల్లోకి వెళ్లకుండా ఉండాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయండీ అని సూచించారు.

అధికారం కేసీఆర్ చేతుల్లో పెడితే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.తెలంగాణ యువత భవిష్యత్తును కేసీఆర్ మాత్రమే కాపాడగలరని..మూడోసారి గెలిపించాలన్నారు. ఆంధ్రా ముసుగులో లీటర్లు వస్తున్నారు వారి నమ్మకండి..వాళ్లను నమ్మితే మోసం పోతాం అంటూ వ్యాఖ్యానించారు.

Harish Rao : బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత పట్లోళ్ల శశిధర్ రెడ్డి

డబుల్ ఇంజన్ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అని..కేసీఆర్ లేని తెలంగాణని ఊహించుకొనే పరిస్థితి లేదన్నారు.తెలంగాణ ఉద్యామానికి వ్యతిరేకంగా ఉన్నవారికి ఓటు వేయవద్దని సూచించారు. భూఖబ్జా చేతుల్లోకి,మతతత్వ పార్టీ చెతుల్లోకి  పోకుండా చూడాలన్నారు. 18 నుండి అందరం ఎన్నికల రంగంలోకి దిగుతామని..ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చేవారిని నమ్మకండి అంటూ సూచించారు.

ఈటెల రాజేందర్ భయపడే రెండవ స్థానంలో పొటి చేస్తాను అంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు.బీజేపీలో ఆధిపత్యం కోసం ఈటల మాట్లాడుతున్నారు అంటూ విమర్శించారు. ‌కాంగ్రెస్ భీపాం లు బీజేపీ ఆఫీసులో ఇస్తారని..కాంగ్రెస్ ఆఫీసులో బీజేపీ పార్టీ భీపాంలు తయారు అవుతాయి అంటూ సెటైర్లు వేశారు.హైదరాబాదు సంపద కొల్లగొట్టడానికి వచ్చే నేతలను, పార్టీలను నమ్మద్దు అంటూ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై విమర్శలు సంధించారు. కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ గురించి ఎందుకు..? అంటూ ప్రశ్నించారు.

అటూ ఇటూ అయితే తెలంగాణ ఎత్తుకుపొవడానికి చూస్తున్నారు అంటూ ఆరోపించారు.బండి‌సంజయ్ గంజాయి ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. కరీంనగర్ గంజాయి ప్రీ గా ఉండాలని సీపీకి ఇంతకు ముందే చెప్పామని తెలిపారు. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని ధీమా వ్యక్తంచేశారు. కర్ణాటకలో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పరిపాలనలో విఫలమైందని విమర్శించారు.కర్ణాటకలో పథకాలు అమలు చెయడానికి ప్రభుత్వం నానా ఇబ్బందులు పడుతోంది అన్నారు.బీజేపీకి తెలంగాణలో ఒక్క సీటు కూడా వచ్చే అవకాశంలేదన్నారు.

ట్రెండింగ్ వార్తలు