Yadagiri Gutta : అమలులోకి యాదగిరిగుట్టపై కొత్త పార్కింగ్ ఫీజులు

కొత్తగా అమలు చేసిన పార్కింగ్‌ ఫీజులను స్థానికులు, భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈవో గీతారెడ్డి 10 రోజులు లీవులో వెళ్లారు.

New parking fees : యాదగిరిగుట్టపై కొత్త పార్కింగ్‌ ఫీజులు అమల్లోకి వచ్చాయి. కారుతో కొండెక్కితే మొదటి గంటకు రూ.500 వసూలు చేస్తున్నారు నిర్వాహకులు. మొదటి గంట తర్వాత ఎన్ని గంటలు ఉంటే అన్ని గంటల వరకు.. ప్రతి గంటకు రూ.100 చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కొత్తగా అమలు చేసిన పార్కింగ్‌ ఫీజులను స్థానికులు, భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈవో గీతారెడ్డి 10 రోజులు లీవులో వెళ్లారు.

ఈ కొత్త రూల్ ను అధికారులు నిన్న తీసుకొచ్చారు. అయితే ఈ రూల్ ను స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. అయితే వీఐపీలు, వీవీఐపీలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అలాగే దాతలకు కూడా దీన్ని నుంచి మినహాయింపు ఇచ్చారు. సామాన్యభక్తులు అనేక మంది వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు అక్కడి వస్తుంటారు.

Yadagirigutta Parking Charges : గంటకు రూ.500.. యాదగిరిగుట్టపై పార్కింగ్‌ చార్జీల బాదుడు

ఫోర్ వీలర్ కు ఈ రూల్ వర్తిస్తుందని అధికారులు చెప్పిన నేపథ్యంలో ఫోర్ వీలర్స్.. అంటే కారు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కారుతో కొండపైకి వెళ్తే ప్రతి గంటకు రూ.500 అంటే చాలా పెద్ద మొత్తంలో ఫీజు వసూలే చేస్తున్నారు. సమాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. గంట దాటితే ప్రతి గంటకు అదనంగా రూ.100 వసూలు చేయబోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు