Arvind Dharmapuri : హోల్ సేల్‌గా దేశాన్ని ముస్లింలకు అప్పగిస్తాం అంటున్నారు- కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఎంపీ ఫైర్

టెర్రరిజం అమలు చేసేది కాంగ్రెస్ పార్టీ. భారత్ ను తాలిబాన్ కు అడ్డాగా మార్చే పార్టీ కాంగ్రెస్.

Arvind Dharmapuri : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. రిజర్వేషన్ల విషయంలో ఇరు పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ప్రధాని మోదీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలు సైతం తగ్గేదేలే అన్నట్లుగా కాంగ్రెస్ నాయకుల ఆరోపణలకు అంతే ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. భారత్‌ను తాలిబాన్‌కు అడ్డాగా మార్చే పార్టీ కాంగ్రెస్ అంటూ ఎదురుదాడికి దిగుతున్నారు.

నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పై ఆయన నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో భారతీయులను అభద్రతకు గురి చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ”ఎక్స్ రే చేస్తాం.. ఆస్తులు, బంగారం వివరాలు తీసి.. ముస్లింలకు పంచుతామని కాంగ్రెస్ అంటోంది. దేశ సంపద, వనరుల మీద మొదటి హక్కు ముస్లింలది అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ముస్లింలకు బ్యాంకులు ఇచ్చే రుణాలపై కాంగ్రెస్ హామీ ఇస్తా అంటోంది. అన్ని రంగాల్లో ముస్లింలను ప్రోత్సహిస్తాం. రిజర్వేషన్లు వాళ్ళకే ఇస్తాం అంటోంది. హాల్ సేల్ గా దేశాన్ని ముస్లింలకు అప్పగిస్తాం అంటున్నారు. ముస్లింల రిజర్వేషన్లు తీసి ఎస్సీ, ఎస్టీలకు ఇస్తాం. బీజేపీ స్టాండ్ ఇది. ముస్లింలకు రిజర్వేషన్లు అనేది రాజ్యాంగ వ్యతిరేకం అని అనేకసార్లు అమిత్ షా చెప్పారు.

6 గ్యారంటీల గురించి చెప్పమంటే.. రేవంత్ రెడ్డి తేదీలు చెబుతూ వెళ్తున్నారు. రైతులు, మహిళలు, యువతను మోసం చేసి.. చార్జిషీట్ అంటూ రేవంత్ రెడ్డి కొత్త డ్రామా చేస్తున్నారు. కరోనా సమయంలో దేశాన్ని కాపాడిన ఘనత మోదీదే. 130కి పైగా పేద దేశాలకు వ్యాక్సిన్ పంపి భారత్ కీర్తిని పెంచారు. వ్యవసాయంలో డ్రోన్ వినియోగం, నానో యూరియా వినియోగం వంటి టెక్నాలజీ మోదీ తెచ్చారు.

కాంగ్రెస్ వచ్చి ఆరు నెలలు అవుతోంది. వాగ్దానాలు ఏమయ్యాయి? చక్కెర పరిశ్రమ సెప్టెంబర్ 17 వరకు తెరుస్తానని సీఎం అంటున్నారు. కానీ రేవంత్ ప్రభుత్వం వేసిన కమిటీ మాత్రం 2025 డిసెంబర్ అంటోంది. ఇందులో ఏది నిజం? మోదీ హయాంలో ప్రపంచం సెక్యులర్ గా మారుతోంది.
గల్ఫ్ దేశాల్లో రంజాన్ ఉపవాస దీక్ష ముగించి ఆలయాల్లో ప్రసాదం తీసుకుని దీక్ష విరమించారు.

కాంగ్రెస్ డిశ్చార్జి అయ్యింది. ఇంకేం ఛార్జి షీట్. మూడుసార్లు పెట్రో ధరలు మోదీ తగ్గించారు. రేవంత్ ఎందుకు తగ్గించరు? బీజేపీ జాతీయవాద పార్టీ.. కాంగ్రెస్ ది పాకిస్థాన్ అజెండా. టెర్రరిజం అమలు చేసేది కాంగ్రెస్ పార్టీ. భారత్ ను తాలిబాన్ కు అడ్డాగా మార్చే పార్టీ కాంగ్రెస్. మోదీ హయాంలో ప్రతి ఏటా కోటి 44లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. వ్యవసాయ శాఖ నుంచి పసుపు బోర్డు తెస్తామని కాంగ్రెస్ అంటోంది. 60 ఏళ్లు ఇలాగే సమయం వృధా చేశారు. అసలు పసుపు వాణిజ్య శాఖ పరిధిలో ఉంటుందన్న విషయం తెలియదా? కాంగ్రెస్ అంటేనే క్రైసిస్. ముందు రాహుల్ గాంధీని ఛార్జ్ చెయ్యండి.. ఆ తర్వాత ఛార్జి షీట్లు విడుదల చెయ్యొచ్చు” అని ఎంపీ అరవింద్ అన్నారు.

Also Read : రిజర్వేషన్ల రద్దు కోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు : సీఎం రేవంత్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు