Ticket Prices : వైజాగ్ టు హైదరాబాద్ రూ.3వేలు.. టికెట్ల ధరలు భారీగా పెంపు

దసరా సీజన్ కావడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడు స్టార్ట్ చేసేశాయి. టికెట్ ధరలు భారీగా పెంచేశాయి. విశాఖ నుంచి హైదరాబాద్ కు వచ్చే ప్రత్యేక బస్ టికెట్ పై 200శాతం రేట్లను పెంచేశాయి. వైజా

Ticket Prices : దసరా సీజన్ కావడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడు స్టార్ట్ చేసేశాయి. టికెట్ ధరలు భారీగా పెంచేశాయి. విశాఖ నుంచి హైదరాబాద్ కు వచ్చే ప్రత్యేక బస్ టికెట్ పై 200శాతం రేట్లను పెంచేశాయి. వైజాగ్ నుంచి హైదరాబాద్ కు గరిష్టంగా రూ.3వేలు వసూలు చేస్తున్నారు. విశాఖ నుంచి విజయవాడకు రూ.2వేల నుంచి 3వేలు వసూలు చేస్తున్నారు. స్లీపర్, సీటింగ్ టికెట్లకు ఒకే చార్జీలు వసూలు చేస్తుండగా, నాన్ ఏసీ కంటే ఏసీపై రూ.500 నుంచి 800 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు.

Internet: ఇంటర్నెట్ ‘స్లో’గా ఉందా? చిటికెలో వైఫై స్పీడ్ పెంచుకోండి!

దసరా పండక్కి ఊరెళ్లాలని చాలామంది అనుకుంటారు. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ షురూ చేశాయి. అదనపు చార్జీలతో ప్రయాణికులను దండుకునే పనిలో ఉన్నాయి. ప్రైవేటు ట్రావెల్‌ ఆపరేటర్లు ఇప్పటికే ధరలు పెంచేయగా.. ప్రత్యేక బస్సుల్లో 50శాతం ఛార్జీలు పెంచేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. 6వ తేదీ నుంచి విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించడంతో ఇటు ఆర్టీసీ, అటు ప్రైవేటు ట్రావెల్స్‌ వేల సంఖ్యలో సర్వీసులు సిద్ధం చేస్తున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ 7వ తేదీ నుంచి స్పెషల్ బస్సులు నడుపుతుండగా.. తెలంగాణ ఆర్టీసీ ఈనెల 8 నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది.

Facebook Outage : ఆమె లైవ్‌లో కనిపించింది అంతే.. క్షణాల్లో ఫేస్‌బుక్ సర్వీసులన్నీ బంద్..!

రద్దీని బట్టి ప్రైవేటు ట్రావెల్స్ టికెట్‌ ధరను 125 శాతం పెంచాయి. పండగ దగ్గర పడే కొద్దీ అవి మరింత పెరుగుతాయని తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖ నగరాలకు ఎక్కువగా డిమాండ్‌ ఉంటుంది. విజయవాడకు ఏసీ స్లీపర్‌ బస్సుల్లో టికెట్‌ రూ.1,100కి, నాన్‌ ఏసీ స్లీపర్‌ ధర రూ. 1,000, వోల్వో అయితే రూ. 2వేల వరకు ధర పలుకుతోంది. ఏసీ బస్సుల్లో సీటుకు రూ. 1,000 నుంచి రూ. 1,200 వరకు వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో టికెట్‌ ధర రూ. 500 నుంచి రూ. 600 వరకు మాత్రమే. విశాఖపట్నం మార్గంలో బస్సు స్థాయిని బట్టి రూ. 1,100 నుంచి రూ. 3వేల వరకు ఉంది. రాజమండ్రికి టికెట్‌ ధర రూ. 900 నుంచి రూ. 2వేల వరకు పలుకుతోంది.

దసరా పండగ నిమిత్తం తెలంగాణ ఆర్టీసీ 4వేల 35 స్పెషల్ బస్సులు నడపాలని నిర్ణయించింది. ఏపీ‌, కర్ణాటక రాష్ట్రాలకు 950, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు 3వేల 85 సర్వీసులు నడపనుంది. 8వ తేదీ నుంచి వీటిని కేటాయించింది. అత్యధికంగా 14వ తేదీన 889 సర్వీసులను, అతి తక్కువగా 15వ తేదీన 84 సర్వీసులను నడపనుంది. వీటిలో రిజర్వేషన్‌ సదుపాయం ఉన్న బస్సుల టికెట్‌ ధరను 50 శాతం పెంచింది. ప్రైవేట్ ట్రావెల్స్ కూడా 5 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నాయి.

టికెట్ల ధరలు పెంచకూడదు, అదనంగా చార్జీలు వసూలు చేయకూడదు, లేదంటే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నా ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం కేర్ చెయ్యడం లేదు. ప్రయాణికులను దొరికినకాడికి దోచుకోవడానికి రెడీ అయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు