AP Election 2024 : ఓటు వేసేందుకు సొంతూళ్లకు.. హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవేపై భారీగా వాహనాల రద్దీ

తెలుగు రాష్ట్రాల్లో ఎల్లుండి జరిగే పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ లో ఉండే ఏపీ ప్రజలు, తెలంగాణలోని ఇతర జిల్లాలకు చెందిన ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు.

AP Assembly Elections 2024

Hyderabad to Vijayawada Highway Rush : తెలుగు రాష్ట్రాల్లో ఎల్లుండి జరిగే పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకునేందు హైదరాబాద్ లో ఉండే ఏపీ ప్రజలు, తెలంగాణలోని ఇతర జిల్లాలకు చెందిన ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. పది రోజుల నుంచే బస్సుల్లో సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా విజయవాడ, విశాఖ పట్టణం, తూర్పు గోదావరి, ఒంగోలు, గుంటూరు తదితర జిల్లాలకు వెళ్లేవారితో హైదరాబాద్ లోని పలు బస్టాండ్ లలో ప్రయాణికులతో రద్దీ ఏర్పడింది. హైదరాబాద్ నుంచి ఏపీ ఓటర్లు వెళ్తిపోతుండటంతో టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Also Read : Cm Revanth Reddy : గొడవలు సృష్టించి హైదరాబాద్ పెట్టుబడులను గుజరాత్ తరలించే ప్రయత్నం చేస్తోంది- బీజేపీపై సీఎం రేవంత్ పైర్

ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి ఏపీ ప్రజలు భారీ సంఖ్యలో ఏపీకి తరలివెళ్తున్నారు. దీంతో శుక్రవారం సాయంత్రం నుంచి హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి చేరుకోవడంతో పలు చోట్ల నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. దీనికితోడు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ లు అవుతుండటంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చౌటుప్పల్, పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి.

Also Read : ఏడాదిలోపు తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. సీఎం రేవంత్ రెడ్డి నా శిష్యుడే: ఎర్రబెల్లి

ఏపీ ప్రజలు లక్షల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి రిత్యా హైదరాబాద్ ఉంటున్నారు. మే13న ఏపీలో పోలింగ్ ఉండటంతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఏపీ ప్రజలు తమ సొంత గ్రామాలకు పయణమయ్యారు. దీంతో శుక్రవారం సాయంత్రం నుంచి బస్సులు, ప్రైవేట్ వాహనాలు, సొంత వాహనాల్లో ప్రజలు ఏపీ బాటపట్టారు. దీంతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. భారీ సంఖ్యలో ఓటర్లు ఏపీకి తరలివెళ్తుండటంతో ఈసారి ఓటింగ్ శాతం పెరిగే ఛాన్స్ ఉంది.