ఏడాదిలోపు తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. సీఎం రేవంత్ రెడ్డి నా శిష్యుడే: ఎర్రబెల్లి
Errabelli Dayakar Rao: రేవంత్ రెడ్డి మూడుసార్లు గెలిచి సీఎం అయ్యారని, తాను ఇప్పటికే ఏడుసార్లు గెలిచానని ఎర్రబెల్లి చెప్పారు.

Errabelli Dayakar Rao
ఏడాదిలోపు తెలంగాణలో ఎన్నికలు రావడం ఖాయమని మాజీ మంత్రి దయాకర్ రావు అన్నారు. వరంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి తన శిష్యుడేనని చెప్పారు. ఆయన ఒకసారి గెలిచిన చోట మళ్లీ అక్కడ పోటీ చేయరని అన్నారు. అబద్ధాలు ఆడబట్టే సీఎం అయ్యారని తెలిపారు.
రేవంత్ రెడ్డి మూడుసార్లు గెలిచి సీఎం అయ్యారని, తాను ఇప్పటికే ఏడుసార్లు గెలిచానని ఎర్రబెల్లి చెప్పారు. రేవంత్ రెడ్డి గుళ్ల మీద ఒట్టు వేస్తున్నారని అన్నారు. ఆయన బిడ్డ మీద ఒట్టు వేయాలని చెప్పారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు రూ.100 కోట్ల ఆఫర్ ఇచ్చినప్పటికీ, తాను పార్టీ మారలేదని అన్నారు.
మంత్రి పదవి ఇస్తానన్నా కాంగ్రెస్ లోకి వెళ్లలేదని తెలిపారు. అధికారంలో లేకపోయినప్పటికీ తమ కార్యకర్తలపై ఈగ వాలినా ఊరుకోనని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు తమ కార్యకర్తల్లో ఒక్కరి జోలికి వచ్చినా వందమందిని ఉరికిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ వాళ్లు బెదిరిస్తే భయపడేది లేదని చెప్పారు.
Also Read: టీడీపీ నేతలు మనుషులా, రాక్షసులా ..? అప్పుడు అసెంబ్లీలో ఎందుకు మద్దతు ఇచ్చారు : సజ్జల రామకృష్ణారెడ్డి