Raghunandan Rao Madhavaneni : మోచేతికి బెల్లం పెట్టినట్లుగా బీఆర్ఎస్ మేనిఫెస్టో, హరీశ్ రావు చెప్పుల ఖరీదు లక్ష రూపాయలు- రఘునందన్ రావు

మద్యం ద్వారా వచ్చే ఆదాయంలో దేశంలో తెలంగాణను నెంబర్ వన్ చేశారు. కేసీఆర్ పరిపాలనలో వచ్చిన కరెక్ట్ నోటిఫికేషన్ కేవలం వైన్స్ కు వచ్చినది మాత్రమే. Raghunandan Rao

Raghunandan Rao Criticise BRS Manifesto (Photo : Facebook, Google)

Raghunandan Rao Criticise BRS Manifesto : సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. సీఎం కేసీఆర్ టార్గెట్ గా విరుచుకుపడుతున్నాయి. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టారని రేవంత్ రెడ్డి, ఓట్ల కోసం కేసీఆర్ కొత్త డ్రామా మొదలు పెట్టారని వైఎస్ షర్మిల విమర్శించారు. తెలంగాణ ప్రజల చెవుల్లో రోజా పూలు పెట్టే ప్రయత్నం అంటూ కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో మోచేతికి బెల్లం పెట్టినట్లు ఉందని విమర్శించారాయన.

మూడోసారి అధికారంలోకి రావడానికే..
మెదక్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ పాల్గొన్నారు. బీజేపీ రాజకీయ పార్టీలకు భిన్నంగా ఉంటుందని, సిద్ధాంతాన్ని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుందని ఆయన వెల్లడించారు. మూడోసారి అధికారంలోకి రావడం కోసమే సీఎం కేసీఆర్ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా ఉందన్నారు రఘునందన్ రావు.

Also Read : మా మేనిఫెస్టోను కేసీఆర్ కాపీ కొట్టారు- రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

మద్యం ద్వారా ఆదాయం.. దేశంలో తెలంగాణ నెంబర్ 1
‘పెన్ష‌న్‌దారుల‌కు ప్ర‌స్తుతం రూ.2వేలు ఉన్న పెన్ష‌న్‌ను రూ.5 వేల‌కు పెంచుతామ‌ని చెప్పడం. ఈ స్కీంలో భాగంగా వ‌చ్చే ఏడాది మార్చి త‌ర్వాత రూ.3 వేలు చేస్తాం. ప్ర‌తి ఏడాది రూ.500 పెంచుకుంటూ ఐదో సంవ‌త్స‌రం నాటికి రూ.5 వేలు చేస్తామంటున్నారు. తెలంగాణ రాక ముందు మద్యం ద్వారా రూ.10వేల కోట్ల ఆదాయం వచ్చేది. కిరాణ షాపులో ఉప్పు పప్పు అమ్మే విధంగా బెల్ట్ షాపులను పెట్టి మద్యాన్ని అమ్మిపిస్తున్నారు. దాంతో పదేళ్లలో 40వేల కోట్లకు ఆదాయం పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది. మద్యం ద్వారా వచ్చే ఆదాయంలో దేశంలో తెలంగాణను నెంబర్ వన్ చేశారు.

ప్రవళిక హత్యను రాజకీయం చేస్తున్నారు..
చంద్రశేఖర్ పరిపాలనలో ఒక్క నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్లు వేసినా లీకులు అవుతాయి లేదా కోర్టుకు వెళ్లి స్టే తెస్తారు. కేసీఆర్ పరిపాలనలో వచ్చిన కరెక్ట్ నోటిఫికేషన్ కేవలం వైన్స్ కు వచ్చినది మాత్రమే. అది చంద్రశేఖర రావుకి ఇష్టమైన నోటిఫికేషన్. గ్రూప్-2 వాయిదా పడి చనిపోయిన ప్రవళిక హత్యను రాజకీయం చేస్తున్నారు. మానవతా దృక్పథంతో ఆలోచించకుండా ప్రేమ వ్యవహారం అని పోలీసులతో స్టేట్ మెంట్లు ఇప్పిస్తున్నారు. దుబ్బాకలో బుద్ధి చెప్పినట్టే ఇక్కడ కూడా బుద్ధి చెప్పాలి. 274 బూత్ కమిటీలు మీటింగ్ పెట్టుకోవాలి. మామిండ్ల, శశిధర్ రెడ్డి మారినట్టుగా మీరు మారరు.

Also Read : బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల.. కేసీఆర్‌ బీమా కింద కుటుంబానికి రూ.5 లక్షలు.. ప్రతి ఇంటికీ ఇకపై సన్నబియ్యం

హరీశ్ రావు మెదక్ ను దోచుకున్నారు..
హరీశ్ రావు లక్ష రూపాయల చెప్పులు వేస్తారు. మెదక్ ను దోచుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నూటికి 99 మంది ఓడిపోతారని అనుకుంటున్నారు. సూట్ కేసులకు అమ్ముడుపోయే పార్టీ కాదు బీజేపీ. ఇతర పార్టీలలో మాదిరిగా టికెట్లు ఇవ్వకపోతే వేరే పార్టీల్లో చేరే నాయకులు బీజేపీలో లేరు. బీ ఫామ్ ఎవరికిచ్చినా కష్టపడి పని చేస్తారు. సంకల్ప బలం ఉన్న పార్టీ బీజేపీ. తెలంగాణ వస్తే జీవితాలు మారుతాయి అనుకున్నా. కానీ, మారలేదు” అని రఘునందన్ రావు అన్నారు.

93లక్షల కుటుంబాలకు బీమా పథకం.. కేసీఆర్ వరాల జల్లు
బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రజలకు వరాలు కురిపించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తమ పార్టీయే మళ్లీ అధికారంలోకి వస్తుందన్న కేసీఆర్ ప్రజలను ఆకర్షించే హామీలను ప్రకటించారు. తెలంగాణలో తెల్ల రేషన్ కార్డు కలిగున్న ప్రతి పేద ఇంటికి రైతు బీమా తరహాలోనే రూ.5లక్షల జీవిత బీమా కల్పిస్తామని వెల్లడించారు. దీనికి కేసీఆర్ బీమా-ప్రతి ఇంటికి ధీమా అనే పేరు పెట్టారు. దీని ద్వారా దాదాపు 93లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది.

ఆసరా పెన్షన్ల మొత్తాన్ని రూ.5వేలకు పెంచారు. వచ్చే ఏడాది 3వేలకు పెంచి తర్వాత దశల వారిగా పెంచుతూ 5వేలకు చేరుస్తామన్నారు. దివ్యాంగులకు పెన్షన్ రూ.6వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది రూ.5వేలకు పెంచి తర్వాత ప్రతి ఏటా రూ.300 పెంచుతామని కేసీఆర్ వెల్లడించారు.

సాభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన పేద మహిళలకు ప్రతి నెల రూ.3వేలు భృతి చెల్లిస్తామన్నారు కేసీఆర్. అర్హులైన పేదలతో పాటు అక్రిడేషన్ ఉన్న ప్రతి జర్నలిస్టుకు రూ.400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ.5లక్షలకు పెంచుతామన్నారు. దీనికి కేసీఆర్ ఆరోగ్య రక్ష అనే పేరు పెట్టారు. రైతుబంధు సాయాన్ని దశలవారిగా రూ.16వేలకు పెంచుతున్నారు. వచ్చే ఏడాది రూ.12వేల రైతుబంధు సాయం అందిస్తామన్నారు. హైదరాబాద్ లో మరో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కడతామని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు