Rahul Gandhi : ఆ మూడు పార్టీలు కాంగ్రెస్ ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయి.. వాళ్లంతా ఒక్కటే

అదానీ లక్షలాది కోట్లు తీసుకుంటే అడగకముందే మాఫీ చేస్తున్నారు.. కానీ, ఒక రైతు రుణాన్ని, కార్మికుల అప్పును, స్వయం ఉపాధి లోన్లు మాఫీ చేయరు.

Rahul Gandhi

Rahul Gandhi Telangana Tour: తెలంగాణ సమాజం ప్రజా తెలంగాణను కోరుకుంది.. కానీ తెలంగాణ కేవలం ఒక కుటుంబం చేతిలో బందీ అయిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కాంగ్రెస్ ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయి. ఆ మూడు పార్టీలు ఒకరినొకరు సహకరించుకుంటున్నాయి. ఎంఐఎం బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదు. దేశవ్యాప్తంగా ఆ పార్టీ బీజేపీకి పరోక్ష మద్దతు ఇస్తోంది. ఎంఐఎం ఎక్కడ ఏ అభ్యర్థులను పెట్టాలో బీజేపీనే నిర్ణయిస్తుందని రాహుల్ గాంధీ అన్నారు.

Read Also : MLC Kavitha: మోసం కాంగ్రెస్ నైజం.. కాంగ్రెస్ కు ఓటేస్తే కర్ణాటక గతే.. కర్ణాటక మంత్రి వీడియో షేర్ చేసిన ఎమ్మెల్సీ కవిత

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే. నేను బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే నాపై కేసులు పెట్టారు. లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారు. కేసీఆర్ నిజంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడితే ఆయనపై ఎందుకు ఈడీ, సీబీఐ కేసులుండవు. దీనినిబట్టి అందరికి అర్థమయ్యే ఉంటుంది.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని అంటూ రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో కులగణన చేపట్టాలని మేం డిమాండ్ చేస్తున్నాం. కులగణన దేశానికి ఎక్స్ రే లాంటిదని రాహుల్ పేర్కొన్నారు. కులగణనతోనే దేశంలో వివిధ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతాయి. దేశంలోని అధికారుల్లో ఎంతమంది బీసీ, ఎస్టీ, ఎస్సీ అధికారులు ఉన్నారని పార్లమెంట్ లో ప్రశ్నించా. కేవలం 5శాతం మంది ఆ వర్గాలకు చెందిన అధికారులు ఉన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాల వారిని భాగస్వాములను చేయాలని, కులగణన చేపట్టి దేశ సంపదను అన్ని వర్గాల వారికి అందేలా చూడాలని రాహుల్ డిమాండ్ పేర్కొన్నారు.

Read Also : Minister KTR : తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే, బస్సుయాత్ర తుస్సుమనడం ఖాయం : కేటీఆర్

అదానీ లక్షలాది కోట్లు తీసుకుంటే అడగకముందే మాఫీ చేస్తున్నారు.. కానీ, ఒక రైతు రుణాన్ని, కార్మికుల అప్పును, స్వయం ఉపాధి లోన్లు మాఫీ చేయరు. దేశ సంపదను అదానీకి కట్టబెడుతున్నారంటూ రాహుల్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాజస్థాన్, ఛత్తీస్ గడ్, కర్నాటకలో ఇచ్చిన హామీలను అమలు చేశాం. తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని రాహుల్ చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు