కళింగపట్నం సమీపంలో తీరందాటిన వాయుగుండం.. ఏపీలోని ఆ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు..

వాయుగుండం తీరందాటింది. కళింగపట్నం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో తీరందాటింది. దీని ప్రభావంతో ఆదివారం పలు చోట్ల ..

Heavy rains in AP

Heavy Rain Alert : వాయుగుండం తీరందాటింది. కళింగపట్నం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో తీరందాటింది. దీని ప్రభావంతో ఆదివారం పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, నంద్యాల, కర్నూల్ జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Also Read : Rain Alert : తెలంగాణలో వర్ష బీభత్సం.. తొమ్మిది జిల్లాలకు రెడ్ అలెర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..

బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం రోజంతా ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా విజయవాడ నగరం అతలాకుతలమైంది. రోడ్లన్నీ జలదిగ్భందమయ్యాయి. వరద ప్రవాహానికి పలు ప్రాంతాల్లో కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు చేరడంతో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. గత 30ఏళ్లలో ఎప్పుడూలేని విధంగా భారీ వర్షం కురవడంతో నగరం విలవిల్లాడింది. విజయవాడ నగరంలోని ఏలూరు రోడ్డు, ఆటోనగర్, పాతబస్తీ, బందరు రోడ్డుతోపాటు పలు ప్రాంతాల్లో భారీ వరద పోటెత్తింది. శనివారం కురిసిన భారీ వర్షాల కారణంగా గుంటూరు, విజయవాడల్లో 10మంది మృత్యువాత పడ్డారు.

 

కృష్ణా నది వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాలువలు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని, పొంగి పొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ప్రజలకు సూచించారు.

 

ట్రెండింగ్ వార్తలు