Revanth Reddy : BRS ముఖ్యనేతల పోటీ స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్‌, వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి అడుగులు

మండవకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, ఏనుగు రవీందర్ రెడ్డికి బాన్సువాడ నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి. Revanth Reddy

Revanth Reddy New Strategy

Revanth Reddy New Strategy : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. నవంబర్ 30న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారం కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది. ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశాక తదుపరి ఎమ్మెల్యే అభ్యర్థులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే గెలుపు గుర్రాల వేట ప్రారంభించింది.

బలమైన నేతలను పార్టీలోకి తీసుకుని..
బలమైన నేతలను పార్టీలోకి తీసుకుని టికెట్లు ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చూస్తున్నారు. మండవ వెంకటేశ్వరరావు, ఏనుగు రవీందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డిలను పార్టీలోకి తీసుకోవాలనే యోచనలో కాంగ్రెస్ ఉంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై బలమైన ప్రత్యర్థిని దింపాలని చూస్తున్నారు రేవంత్. మంత్రి ఎర్రబెల్లిపై రేవూరి ప్రకాశ్ రెడ్డిని బరిలోకి దింపే యోచనలో ఆయన ఉన్నారు. మండవకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, ఏనుగు రవీందర్ రెడ్డికి బాన్సువాడ నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి.

Also Read : 45 రోజులు మా కోసం పని చేయండి, ఐదేళ్లు మేము మీకోసం చేస్తాం : కేటీఆర్

ఇతర పార్టీల్లోని ముఖ్యనేతలపై ఫోకస్..
అభ్యర్థుల ఎంపిక విషయంలో రేవంత్ రెడ్డి చాలా కేర్ తీసుకుంటున్నారు. బలమైన నేతలను పార్టీలోకి తీసుకుని బరిలోకి దింపాలనే యోచనలో ఉన్నారు. అందులో భాగంగా పార్టీ ఏయే ప్రాంతాల్లో అయితే వీక్ గా ఉందని భావిస్తున్నారో అక్కడ ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకుని కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని యోచిస్తున్నారు. కాంగ్రెస్ కు కాస్త వేవ్ వస్తున్నట్లు పరిస్థితులు ఉండటంతో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపితే ఈజీగా గెటాన్ కావొచ్చు అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే ఇతర పార్టీలో ఉన్న ముఖ్యనేతలను కాంగ్రెస్ లోకి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

మండవ నివాసంలో కీలక చర్చలు..
ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కొందరు కీలక నేతలను కలిసి వారితో మంతనాలు జరిపారు. ఉమ్మడి నిజామాబాద్ కు సంబంధించి మండవ వెంకటేశ్వరరావు నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి సైతం మండవ నివాసానికి వెళ్లి చర్చలు జరపడం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే వీరంతా కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. వారందరూ ఒకేచోట కనిపించడం అందుకు బలం చేకూరుస్తోంది.

Also Read : బీఆర్ఎస్, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆచరణకు సాధ్యం కాని హామీలు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఎర్రబెల్లిపై రేవూరి అస్త్రం..
ఉమ్మడి వరంగల్ కు సంబంధించి అక్కడి నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు వరుసగా గెలుస్తున్నారు. దీంతో ఎర్రబెల్లి పై బలమైన అభ్యర్థిని పోటీకి దించాలని రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు. పాలకుర్తికి సంబంధించి ఇద్దరు ఎన్నారైలు ఝాన్సీరెడ్డి, ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, ఎర్రబెల్లిని ఢీకొనాలంటే వారి శక్తి సరిపోదని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో రేవూరి ప్రకాశ్ రెడ్డిని పాలకుర్తి నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. టీడీపీలో ఉన్నప్పుడు నర్సంపేట నుంచి రేవూరి గెలుపొందారు.

ట్రెండింగ్ వార్తలు