RevanthReddy Letter To KCR : ఐదేళ్లకు పెంచండి, లేదంటే 4లక్షల మంది నష్టపోతారు-సీఎం కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి లేఖ

వయోపరిమితి సడలింపు కేవలం మూడేళ్లు మాత్రమే ఇచ్చారని.. దీని వల్ల 4 లక్షల మంది నిరుద్యోగులు నష్టపోయే పరిస్థితి ఉందని వాపోయారు.(RevanthReddy Letter To KCR)

RevanthReddy Letter To KCR : తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. పోలీస్ ఉద్యోగాల భర్తీలో అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని లేఖలో డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. ఇటీవలే ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేన్ ఇచ్చింది. అందులో 17వేల పోలీస్ ఉద్యోగాలు ఉండగా.. వాటిలో కానిస్టేబుల్ పోస్టులు అధికంగా ఉన్నాయి. కాగా, కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయోపరిమితి సడలింపు కేవలం మూడేళ్లు మాత్రమే ఇచ్చారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీని వల్ల 4 లక్షల మంది దరఖాస్తుదారులు నష్టపోయే పరిస్థితి ఉందని వాపోయారు.

KTR On Age Relaxation : ఆ ఉద్యోగాలకు వయో పరిమితి ఐదేళ్లకు పెంపు..! కేటీఆర్ ఏమన్నారంటే..

తెలంగాణ ఉద్యమంలో యువత కీలక పోరాటం చేశారని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. వారికి 5 ఏళ్ల పాటు వయో పరిమితి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఉద్యోగాల కోసం అంత ఇబ్బందులు పడుతుంటే హోంమంత్రి ఉన్నాడో, లేడో తెలియదన్నారు. మీరేమో ఫామ్ హౌస్ లో సేద తీరుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగార్దులు కోరుతున్న విధంగా వయోపరిమితి ఇవ్వాలని లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుందని లేఖలో హెచ్చరించారు రేవంత్ రెడ్డి.(RevanthReddy Letter To KCR)

Revanth Reddy Open Letter To CM KCR Demanding Age Relaxation For Constable Jobs

ఉద్యోగాల నోటిఫికేషన్లు ఆలస్యం కావడం వల్ల వయోపరిమితితో చాలామంది అభ్యర్థులు నష్టపోతున్నారు. ఆస్క్ కేటీఆర్ లో అభ్యర్థులు అడిగినా పట్టించుకోవడం లేదు. మీ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ల జారీలో అలసత్వం చూపించడం వల్ల చాలామంది అభ్యర్థులకు ఏజ్ బార్ అయిపోయింది. ఇప్పుడు మీ ప్రభుత్వం 17వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో కానిస్టేబుల్ పోస్టులు అధికంగా ఉన్నాయి. మీ ప్రభుత్వ నిర్వాకం వల్ల లక్షలాది మంది ఉద్యోగాలకు దూరం అవుతున్నారు.

Revanth Reddy Open Letter To CM KCR Demanding Age Relaxation For Constable Jobs

Telangana Jobs: తెలంగాణలో కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

కరోనా వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీనికి తోడు నాలుగేళ్ల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో చాలామంది ఉద్యోగార్థులు కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం మూడేళ్లు మాత్రమే వయోపరిమితి సడలింపు ఇవ్వడంతో 4 లక్షల మంది నిరుద్యోగులు కానిస్టేబుల్ ఉద్యోగాలకు దూరం అయ్యారు. వారికి అన్యాయం జరక్కుండా కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో 5 ఏళ్ల పాటు వయోపరిమితి ఇవ్వాలి” అని తన లేఖలో డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.

Government Jobs : తెలంగాణలో 86వేల ఉద్యోగాలు ఖాళీ, త్వరలో 55వేల పోస్టులు భర్తీ..!

కాగా, పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. దాదాపు 17 వేలకు పైగా ఖాళీలు భర్తీ చేయనున్నారు. అయితే.. పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి వయో పరిమితి విషయంలో నిరుద్యోగుల నుంచి విపరీతమైన డిమాండ్ వస్తోంది. వయోపరిమితిని మూడేళ్ల పాటు పెంచింది తెలంగాణ సర్కార్. కనీసం ఐదేళ్లయినా పెంచాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

పోలీస్ శాఖలోని అనేక విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అందులో భాగంగా పెద్ద ఎత్తున కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 17,099 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో 587 ఎస్ఐ, 414 సివిల్ ఎస్ఐలతో పాటు 16,027 కానిస్టేబుల్, 66 ఏఆర్ ఎస్ఐ, 5 రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.

ట్రెండింగ్ వార్తలు