SSC Paper leak Case: టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న విద్యార్థి హరీశ్ కి ఊరట

విద్యార్థి హరీశ్ ని అధికారులు ఇప్పటికే డిబార్ చేశారు. పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని హరీశ్ తండ్రి హైకోర్టులో పిటిషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతుగా నిలిచింది.

SSC Paper leak Case: తెలంగాణలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న హరీశ్ కి హైకోర్టులో ఊరట దక్కింది. సోమవారం నుంచి హరీశ్ పదో తరగతి పరీక్షలు రాసేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. పేపర్ లీకేజీ ఆరోపణపై హరీశ్ డిబార్ అయిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ హైకోర్టులో విద్యార్థి హరీశ్ తండ్రి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

తన కొడుకు హరీశ్ పదో తరగతి పరీక్షలు రాసేలా అనుమతి ఇవ్వాలని కోరారు. హరీశ్ హిందీ పరీక్ష రాస్తున్నప్పుడు ఎవరో బలవంతంగా పేపర్ లాకున్నారని చెప్పారు. హరీశ్ పేరు ఎఫ్ఐఆర్ లో లేదని వివరించారు. అయినప్పటికీ అధికారులు నిన్నటి పరీక్షను రాయనివ్వలేదని తెలిపారు. తన కొడుకు హరీశ్ ను రాజకీయాలకు బలి చేశారని చెప్పారు.

Also Read..SSC Paper leak Case: టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న విద్యార్థి హరీశ్ కి ఊరట

తన కొడుకు హరీశ్ మిగతా పరీక్షలయినా రాసేలా అనుమతి ఇవ్వాలని కోరారు. విద్యార్థి హరీశ్ తరుఫున కోర్టుకు ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కోర్టుకు వెళ్లారు. హరీశ్ కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిలిచింది. విద్యార్థి భవిష్యత్ దృష్ట్యా కాంగ్రెస్ తరుఫు న్యాయవాది వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.

మిగతా పరీక్షలు రాసేందుకు హరీశ్ కు అనుమతి ఇవ్వాలని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక హిందీ, ఇంగ్లిష్ పేపర్ల పరీక్షలకు కూడా సప్లిమెంటరీకి అనుమతి ఇవ్వాల్సిదేనని చెప్పింది. కాంగ్రెస్ నేతలకు బాధిత విద్యార్థి హరీశ్ తల్లిదండ్రుల కృతజ్ఞతలు తెలిపారు. కాగా, హరీశ్ తరఫున తాను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా, ఆ విద్యార్థి మిగతా పరీక్షలు రాసుకోవడానికి అనుమతినిచ్చిందని బల్మూరి వెంకట్ ట్వీట్ చేశారు.

Doctor Tweet Viral : 16 ఏళ్ల నాటి నిజాలు వెల్లడిస్తూ హైదరాబాద్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ట్వీట్ వైరల్..

ట్రెండింగ్ వార్తలు