Neopolis Layout Kokapet: అందరి దృష్టి కోకాపేటపైనే.. అసలు నియోపోలిస్ అంటే అర్థం ఏంటి?

లేఅవుట్‌కు పెట్టిన పేరు నియోపోలిస్.. మరి దానికి అర్థం? ఈ విషయాన్ని తెలుసుకునేందుకే..

Kokapet Neopolis Layout

Neopolis Layout Kokapet – HMDA: హైద‌రాబాద్ (Hyderabad) శివారులోని కోకాపేట(Kokapet) లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) అభివృద్ధి చేసిన నియోపోలిస్ లేఅవుట్‌లో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఐటీ కారిడార్‌లోనే కోకాపేట ఉండడంతో ఈ ప్రాంతం ఇళ్ల నిర్మాణాలు, ఆఫీసులకు అనువుగా ఉంటుంది. భవనాల ఎత్తుపై ఆంక్షలు లేకపోవడంతో రియల్ ఎస్టేట్ కంపెనీలు అమితాసక్తి కనబర్చుతున్నాయి. మొదటి నుంచి ఇక్కడి లేఅవుట్ల అభివృద్ధి అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా నియోపోలిస్ లేఅవుట్‌లోని ప్లాట్ల ధరలు చర్చనీయాంశంగా మారాయి.

గరిష్ఠంగా ఎకరం రూ.100 కోట్లు పలకడంపై ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే దీనికి హెచ్ఎండీఏ Neopolis అని పేరు పెట్టడం. దీంతో Neopolis పదానికి అర్థం ఏంటంటూ నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. కాస్త తికమకపడే సమాధానాలు దొరుకుతున్నాయి.

సెర్చ్ చేస్తే..

గూగుల్‌లో Neopolis అని సెర్చ్ చేస్తే Neapolis అనే పదమే అధికంగా కనపడుతోంది. ఈ నియాపోలిస్ (Neapolis) పదం గ్రీకుకు చెందినదిగా తెలుస్తోంది. దీనికి కొత్త సిటీ (New City) అనే అర్థం ఉంది. ఇటలీలోని అపులియా, మాగ్నా గ్రయేసియాలోని పురాతన సిటీ పేరే ఈ నియాపోలిస్.

నిజానికి ఈ సిటీ పేరును పురాతన రచయితలు ఎవరూ, ఎక్కడా పేర్కొనలేదు. అయితే, అక్కడ లభ్యమైన నాణేల మీద ఉన్న నియాపోలిస్ పేరు ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. ఆ ప్రాంతంలో ప్రాచీనకాలపు అనేక ఆనవాళ్లు కనపడ్డాయి.

Neopolis గురించి గూగుల్‌లో సెర్చ్ చేస్తున్న వారికి మరో ఫలితం కూడా వస్తోంది. బ్రెజిల్‌లోని సెర్గిప్ రాష్ట్రంలో ఉన్న ఓ మునిసిపాలిటీ పేరు Neópolis అని తెలుస్తోంది. 2020లో ఈ ప్రాంత జనాభా 18,703.

మొత్తానికి కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తూ ఇప్పుడు బుద్వేల్ భూముల అమ్మకంపై కూడా ఆసక్తిని పెంచింది. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ మండలం బుద్వేల్లో అన్ని మౌలిక వసతులతో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన వంద ఎకరాల స్థలాన్ని విక్రయించనున్నారు. మొత్తం 14 ప్లాట్లను అమ్మనున్నారు. ఆగస్టు 10వ తేదీన ఈ వేలం ఉంటుంది.

friendship day 2023 : నిజమైన స్నేహితులు ఎలా ఉండాలో చెప్పిన మానసిక తత్వవేత్త .. మీరు అలా ఉన్నారా..?

ట్రెండింగ్ వార్తలు