Pawan Kalyan : చంద్రబాబును కలిసి రూ.కోటి చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

విజయవాడ కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబు ను కలిసి పవన్ కల్యాణ్.. సీఎం సహాయ నిధికి రూ. కోటి చెక్కును అందజేశారు.

Pawan Kalyan

Pawan Kalyan : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడ కలెక్టరేట్ లో కలిశారు. ఈ సందర్భంగా సీఎం సహాయ నిధికి రూ. కోటి చెక్కును అందజేశారు. కుండపోత వర్షంకుతోడు.. బుడమేరు ఉధృతి పెరగడంతో విజయవాడలోని పలు కాలనీలు వరద ముంపుకు గురయ్యాయి. అదేవిధంగా తెలంగాణలో పలు ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. దీంతో పవన్ కల్యాణ్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. కోటి చొప్పున ప్రకటించారు. అదేవిధంగా వరద ప్రభావంతో దెబ్బతిన్న ఏపీలోని 400 పంచాయతీలకు ఒక్కోదానికి రూ. లక్ష చొప్పున రూ.4కోట్ల సొంత నిధులను విరాళంగా ఇస్తానని వెల్లడించారు. ఆ సొమ్మును నేరుగా ఆయా పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు.

Also Read : Budameru : బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు పూర్తి.. మంత్రులు, అధికారులను అభినందించిన చంద్రబాబు

విజయవాడ కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబు ను కలిసి పవన్ కల్యాణ్.. సీఎం సహాయ నిధికి రూ. కోటి చెక్కును అందజేశారు. అయితే, కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. తొలుత కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణనాథుడి వద్ద ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పూజలు చేశారు.

Also Read : విజయవాడను, లంక గ్రామాలను ముంచాలనే పడవలను వదిలారు : మంత్రి కొల్లు రవీంద్ర

జనసేన కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి పూజలు..
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మట్టి గణపతి ప్రతిమకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూజలు చేశారు. విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి దైవం ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి కరుణాకటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో గడపాలని, విజయాలు సిద్ధించాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్, చేనేత వికాస విభాగం ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు