Budameru : బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు పూర్తి.. మంత్రులు, అధికారులను అభినందించిన చంద్రబాబు

బుడమేరు గండ్లను పూర్తిగా పూడ్చివేశారు. ఇప్పటికే రెండు గండ్లు పూడ్చివేసిన అధికారులు.. శనివారం మూడో గండిని పూడ్చివేసే పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే, గండి నుంచి నీరు బయటకు రాకుండా

Budameru Gandi Works

Budameru Gandi Works : బుడమేరు గండ్లను పూర్తిగా పూడ్చివేశారు. ఇప్పటికే రెండు గండ్లు పూడ్చివేసిన అధికారులు.. శనివారం మూడో గండిని పూడ్చివేసే పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే, గండి నుంచి నీరు బయటకు రాకుండా పూడ్చేశారు. 95శాతం పనులు పూర్తిగా.. మిగిలిన పనులు మరికొద్ది సేపట్లో పూర్తికానున్నాయి. బుడమేరు గండ్లు పూడ్చివేత పనులను విజయవతంగా పూర్తిచేసిన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులను అభినందించారు. అతిపెద్ద సవాల్ ను ఎదుర్కొని పనులు పూర్తి చేశారని ప్రశంసించారు.

Also Read : విజయవాడను, లంక గ్రామాలను ముంచాలనే పడవలను వదిలారు : మంత్రి కొల్లు రవీంద్ర

కుండపోత వర్షంకు తోడు.. ఎగువ ప్రాంతాల్లో నుంచి భారీగా వచ్చిన వరదనీటి కారణంగా బుడమేరు ఉధృతికి మూడు చోట్ల గండ్లు పడ్డాయి. దీంతో విజయవాడ నగరంలోకి పెద్దెత్తున వరదనీరు చేరింది. పలు కాలనీల్లోకి మనిషిలోతు నీరు చేరింది. తాజాగా ఆ గండ్లు పూడ్చివేత పనుల్లో ప్రభుత్వం నిమగ్నమైంది. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రిపగలు అక్కడే ఉండి పనులు పూర్తిచేయిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నంకే రెండు గండ్లు పూడ్చివేత పనులు పూర్తయ్యాయి. మూడో గండి పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి. 40మంది ఆర్మీ ఇంజనీర్ బృందంకూడా ఈ పనుల్లో పాల్గొంటుంది. శనివారం ఉదయం నుంచి అడపాదడపా బుడమేరు గండి పడిన ప్రాంతంలో వర్షం పడుతుంది. అయినా, వర్షంలోనూ గండి పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మూడో గండి నుంచి వాటర్ బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. 95శాతం పనులు పూర్తయ్యాయి. ఇవాళ సాయంత్రం వరకు మూడో గండి పూడ్చివేత పనులు పూర్తవుతాయని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

Also Read : Bhuma Akhila Priya : నేనేంటో చూపిస్తా.. ప్రత్యర్థులకు భూమా అఖిలప్రియ మాస్ వార్నింగ్

గండిపూడ్చే పనులను రామానాయుడుతో కలిసి మంత్రి నారా లోకేశ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమా పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై మంత్రి లోకేశ్ కు రామానాయుడు వివరించారు. మరికొద్ది గంటల్లో పనులు పూర్తవుతాయని తెలిపారు. ఈ మేరకు లోకేశ్ స్పందిస్తూ.. పూడ్చివేత పనులు త్వరగా ముగించాలని, ఆ తరువాత వెంటనే బుడమేరు గట్టు పటిష్ఠత పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడును కోరారు.

 

ట్రెండింగ్ వార్తలు