Yograj Singh : అర్జున్ టెండూల్కర్ కెరీర్‌పై యువీ తండ్రి యోగరాజ్ సింగ్ కామెంట్స్.. బొగ్గు గనిలో..
టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజాలు ఎంఎస్ ధోని, కపిల్ దేవ్‌లను ఉద్దేశించి యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
- Thota Vamshi Kumar
- Published On : September 7, 2024 / 01:00 PM IST
Yograj Singh Reply On Arjun Tendulkars Future Is Viral
Yograj Singh – Arjun Tendulkar : టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజాలు ఎంఎస్ ధోని, కపిల్ దేవ్‌లను ఉద్దేశించి యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో మోగ్‌రాజ్ మాట్లాడుతూ.. ఎంఎస్ ధోనిని తాను జీవితంలో ఎన్నటికి క్షమించను అని, తన కొడుకు యువీ కెరీర్‌ను అతడు నాశనం చేశాడని అన్నారు.
ఇక కపిల్ కెరీర్‌లో ఒకే ఒక్క ట్రోఫీ (1983 వన్డే ప్రపంచకప్) ఉంటే తన కొడుకు యువీ దగ్గర 13 మేజర్ టైటిల్స్ ఉన్నాయన్నాడు. ఇక అదే ఇంటర్వ్యూలో సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్‌కు సంబంధించి పలు కామెంట్లు చేశాడు.
యువరాజ్ సింగ్ క్రికెటర్‌గా ఎదగడంలో యోగరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. అతనికి శిక్షణ ఇచ్చాడు. సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా యోగరాజ్ సింగ్ వద్ద కొన్ని రోజులు శిక్షణ పొందాడు. అర్జున్ టెండూల్కర్ శిక్షణ కోసం మీ వద్దకు వచ్చాడు గదా అతడి కెరీర్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు అని అదే ఇంటర్వ్యూలో యాంకర్ యోగరాజ్ ను ప్రశ్నించాడు.
బొగ్గు గనుల్లో డైమండ్‌ను చూశారా? బొగ్గు గనిలోంచి బయటకు తీసినప్పుడు అది ఒక రాయి. విలువైన వజ్రంగా మారాంటే అది సరైన వ్యక్తి చేతుల్లో పడాలి. అప్పుడే అమూల్యమైందిగా మారుతుంది. అలా కాకుండా దాని విలువ తెలియని వారి చేతికి వెళితే రెండు ముక్కలుగా చేస్తారు. అలా అని నేను గొప్ప కోచ్ అని చెప్పడం లేదని యోగరాజ్ అన్నారు.
