ENG vs SL : చరిత్ర సృష్టించిన ఓలీపోప్.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. సచిన్ వల్ల కాలేదు
ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు ఓలీపోప్ అరుదైన ఘనత సాధించాడు.

England star Ollie Pope Sets Historic Record Not Even Sachin Tendulkar Achieved It
ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు ఓలీపోప్ అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో ఓవల్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఈ ఘనత అందుకున్నాడు. ఇంగ్లాండ్ రెగ్యులర్ టెస్టు కెప్టెన్ బెన్‌స్టోక్స్ గాయపడడంతో ఈ మ్యాచ్‌కు అతడి స్థానంలో ఓలీపోప్ నాయకత్వ బాధ్యతలను అందుకున్నాడు. శతకంతో చెలరేగాడు. దీంతో ఇంగ్లాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఓలీపోప్ (103), హ్యారీ బ్రూక్ (8) క్రీజులో ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ డేనియల్ లారెన్స్ (5) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఓలీపోప్ మరో ఓపెనర్ బెన్ డకెట్ (79 బంతుల్లో 86 పరుగులు)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరు పోటాపోటీగా బౌండరీలు బాదుతూ లంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా బెన్‌డకెట్ చూడముచ్చటి షాట్లు ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
శతకం దిశగా దూసుకువెలుతున్న బెన్‌డకెట్‌ను మిలన్ రత్నాయక్ ఔట్ చేయడంతో 140 పరుగల వద్ద ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. బెన్‌డకెట్-ఓలీపోప్ జోడీ 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రూట్ (13) విఫలమైనా కూడా హ్యారీ బ్రూక్‌తో కలిసి పోప్ మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు. ఈ క్రమంలో పోప్ 102 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. టెస్టుల్లో ఇది అతడికి ఇది ఏడో సెంచరీ.
ఈ క్రమంలో పోప్ ఓ అరుదైన రికార్డును అందుకున్నాడు. పోప్ సాధించిన ఈ ఏడు శతకాలు కూడా వేర్వేరు జట్లపై సాధించడం విశేషం. 147 టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా ఓ ఆటగాడు తన మొదటి ఏడు సెంచరీలను ఏడు వేరువేరు ప్రత్యర్థులపై సాధించడం ఇదే తొలిసారి.
Rohit Sharma : బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ముందు.. జిమ్‌లో రోహిత్ శర్మ.. ఫోటోలు వైరల్..
దక్షిణాఫ్రికా పై తొలి టెస్టు సెంచరీ చేసిన పోప్.. ఆ తరువాత న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్, భారత్, వెస్టిండీస్, శ్రీలంకపై శతకాలు బాదాడు.