హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి బదిలీ.. కొత్త సీపీ ఎవరంటే?
తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
- Naga Srinivasa Rao Poduri
- Published On : September 7, 2024 / 02:13 PM IST
ips transfers in telangana: తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఇప్పటివరకు పోలీస్ కమిషనర్‌గా ఉన్న కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. విజిలెన్స్ డీజీగా ఆయనను నియమించింది. సీవీ ఆనంద్ స్థానంలో ఏసీపీ డీజీగా విజయ్‌కుమార్‌ను ప్రభుత్వం అపాయింట్ చేసింది.
మహేష్ భగవత్‌కు ADG పర్సనల్ అండ్ వెల్ఫేర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్పోర్ట్స్ గా రమేశ్‌కు ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది.
Also Read: హైదరాబాద్‌లో ఇవాళ్టి నుంచి 17వ తేదీ అర్థరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. ఏఏ ప్రాంతాల్లో అంటే..
సీవీ ఆనంద్ ఇంతకుముందు కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. 2021, డిసెంబర్ 24 నుంచి 2023, అక్టోబర్ 12 వరకు హైదరాబాద్ సీపీగా ఉన్నారు. అంతకుముందు ఆయన కేంద్ర సర్వీసుల్లో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా సేవలు అందించారు. 2017లో రాష్ట్రపతి పోలీసు పతకంతో పాటు ఇన్నోవేటివ్ లీడర్‌షిప్ అవార్డు కూడా అందుకున్నారు.
