Gold Price Today : వినాయక చవితి సందర్భంగా మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

తెలుగు రాష్ట్రాల్లో శనివారం బంగారం ధర భారీగా తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర ..

Gold Price

Gold And Silver Price Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వినాయక చవితి పర్వదినాన్ని వైభవంగా జరుపుకుంటున్నారు. వాడవాడలా మండపాల్లో గణపయ్యలు కొలువుదీరారు. ఇళ్లలో బుజ్జి గణపయ్యలను ప్రతిష్టించుకొని మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించగా.. కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. జై బోలో గణేశ్ మహరాజ్ కు జై.. అనే నినాదంతో తెలుగు రాష్ట్రాలు మారుమోగుతున్నాయి. ఈ సంతోషకరమైన సమయంలో మహిళలకు మరో గుడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో శనివారం 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 440 తగ్గగా, కిలో వెండిపై రూ. 2,500 తగ్గింది. దేశవ్యాప్తంగానేకాక.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో శనివారం బంగారం ధర భారీగా తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,800 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.72,870.

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,950 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 73,020.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.66,800 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.72,870.
చెన్నైలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,800 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,870 వద్ద కొనసాగుతుంది.

వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా శనివారం వెండి ధర భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ. 2,500 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.89,500 వద్దకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ. 89,500.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి రూ. 84,500 వద్ద కొనసాగుతుంది.
బెంగళూరులో వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 84,000 వద్ద కొనసాగుతుంది.

పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.

 

ట్రెండింగ్ వార్తలు