AAY OTT : ఓటీటీలోకి నార్నె నితిన్ ‘ఆయ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ హీరోగా నటించిన మూవీ ఆయ్.
- Thota Vamshi Kumar
- Published On : September 7, 2024 / 01:55 PM IST
Narne Nithiin AAY OTT Release date fix
AAY OTT Release date : ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ హీరోగా నటించిన మూవీ ఆయ్. అంజి మణిపుత్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నయన్ సారిక హీరోయిన్‌గా నటించింది. గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఫ్రెండ్షిప్ నేపథ్యంతో యూత్‌పుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది.
ఇక ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వారికి శుభవార్త అందింది. ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సైంది. ఈ చిత్ర ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడిచింది.
Devara : ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి సాలీడ్ అప్‌డేట్.. సరికొత్త పోస్టర్‌తో.. ఫ్యాన్స్‌కు పూనకాలే
ఈ మూవీని GA2 బ్యానర్ పై బన్నీ వాసు, విద్య కొప్పినీడి నిర్మించారు. సీనియర్ నటుడు వినోద్ కుమార్, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మైమ్ గోపి.. పలువురు ముఖ్య పాత్రలను పోషించారు.
Oorlo edhavalu ante, andharu first anukunedhi veelane. Aay veelu friends andi.#Aay is coming to Netflix on 12 September in Telugu, Tamil, Malayalam and Kannada!#AayOnNetflix pic.twitter.com/5BhXMTzLWy
— Netflix India South (@Netflix_INSouth) September 7, 2024
