జేసీ సంచలన కామెంట్లు : జగన్ ఎవరికీ భయపడరు..ఒక్క మోడీకి తప్ప

  • Publish Date - June 1, 2020 / 07:17 AM IST

సంచనాలకు కేరాఫ్ ఎవరంటే అందిరికీ గుర్తుకొచ్చేది మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఎవరికీ తెలియదు. ఎప్పుడు సీఎం జగన్ ను పొగుడుతారో..ఎప్పుడు విమర్శలు చేస్తారో ఎవరికీ అర్థం కాదు. తాజాగా సీఎం జగన్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. YS జగన్ దేశంలో ఎవరి మాట వినరని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంటే ఆయన భయపడుతారన్నారు.

151 మంది ఎమ్మెల్యేలు ఉంటే రాజ్యాంగాన్ని కూడా పట్టించుకోరా అంటూ ప్రశ్నించారు. నీతి లేదు..నియమం లేదు..చట్టం లేదు..నేను రాజు..నేనే మంత్రి.. సీఎం జగన్ కు మెజార్టీ ఇచ్చి ఉండవచ్చు…రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పారని తెలిపారు. అహం ఉండడం కరెక్టు కాదని, సీఎం జగన్ మనస్సు మార్చుకోవాలని తెలిపారు. 2020, జూన్ 01వ తేదీ సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

జగన్ కు కోర్టు తీర్పులంటే..లెక్క లేదని..SEC విషయంలో ప్రభుత్వం కోర్టుకు పోవడం తప్పు కాదు కానీ..కోర్టు ఆదేశాలు మాత్రం ఖచ్చితంగా పాటించాలని అన్నారు. కోర్టులు ఎన్నిసార్లు చెప్పినా..సీఎం జగన్ వినరని,  ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలని, సమస్యలు తెలుసుకుంటూ..వారి వద్దకు వెళ్లాలన్నారు. నేను నియంతను..153 మంది మెజార్టీ ఇచ్చారు..న్యాయస్థానం లేదు అనుకోవడం కరెక్టు కాదన్నారు.

ఇప్పటికే పాలనపై చదువుకున్న వారందరికీ అవగాహన వచ్చినట్లు, మరికొన్ని రోజుల్లో మిగిలిన వారు తెలుసుకుంటారని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాలను గౌరవించే విధంగా వ్యవహరించాలన్నారు. అమరావతిలో జరుగుతున్న ఉద్యమం వైపు దృష్టి సారించాలని, వారిని సముదాయించే ప్రయత్నం చేయాలన్నారు జేసీ. 

Read:ప్రయాణాలు మొదలయ్యేనా : ఏపీ To తెలంగాణ

ట్రెండింగ్ వార్తలు