Child Dead : ముక్కు సర్జరీకి వెళ్తే ప్రాణమే పోయింది.. ప్రైవేట్ హాస్పిటల్ లో దారుణం.. !

మధ్యాహ్నం చిన్నారికి ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ వికటించి రాత్రి 10 గంటల సమయంలో చిన్నారి మృతి చెందారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు.

Nose operation distorted : నెల్లూరు జిల్లాలో విషాదం నెలకొంది. ముక్కు సర్జరీ కోసం ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్తే ప్రాణమే పోయింది. ముక్కు ఆపరేషన్ వికటించి చిన్నారి మృతి చెందారు. ఈ ఘటన బృందావనంలో చోటు చేసుకుంది. ఆపరేషన్ కోసం నిన్న ఉదయం 11 ఏళ్ళ చిన్నారిని కుటుంబ సభ్యులు నెల్లూరు బృందావనంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చించారు.

మధ్యాహ్నం చిన్నారికి ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ వికటించి రాత్రి 10 గంటల సమయంలో చిన్నారి మృతి చెందారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు.

Female Constable Suicide : తోటి ఉద్యోగి లైంగిక వేధింపులు.. చెరువులో దూకి మహిళా కానిస్టేబుల్ సూసైడ్

హాస్పిటల్ వద్ద కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఆపరేషన్ సరిగానే చేశాం.. గుండె సమస్యతో చనిపోయి ఉండొచ్చని డాక్టర్లు అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు