Best Premium Flagship Phones : ఈ డిసెంబర్‌లో బెస్ట్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

Best Premium Flagship Phones : డిసెంబర్ 2023లో భారత మార్కెట్లో బెస్ట్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా సహా మరో 3 ఫోన్లు ఉన్నాయి. ఈ జాబితాలో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు.

Best Premium Flagship Phones : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, త్వరపడండి.. ఈ డిసెంబర్ 2023లో అత్యుత్తమ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అద్భుతమైన డిస్‌ప్లేలు, ఆకర్షణీయమైన కెమెరాలు, డిజైన్, ఫాస్ట్ ఛార్జింగ్ (వైర్డ్, వైర్‌లెస్ రెండూ) ఆకట్టుకునే ఐపీ రేటింగ్‌లు వంటి అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉన్నాయి. భారత మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యుత్తమ టాప్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఈ జాబితాలో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా మరో మూడు డివైజ్‌లు ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం.

1. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా :
శాంసంగ్ ప్రస్తుత లైనప్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా, అత్యుత్తమ నాన్-ఫోల్డబుల్ ఫోన్‌గా అన్ని ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లలో టాప్ పోటీదారుగా ఉంది. గెలాక్సీ ఎస్24 అల్ట్రా, గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఫోన్, ప్రస్తుతం తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. 6.8-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ అందిస్తుంది.

Read Also : Top 5 Best Camera Smartphones : ఆపిల్ ఐఫోన్ 15 ప్రో నుంచి గూగుల్ పిక్సెల్ 8 ప్రో.. టాప్ 5 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే..!

200ఎంపీ ప్రైమరీ సెన్సార్, వైడ్ యాంగిల్ లెన్స్, రెండు టెలిఫోటో కెమెరాలతో సహా అసాధారణమైన ఫొటోలను కెమెరా సిస్టమ్ కలిగి ఉంది. ఎస్ పెన్ లేయర్ ఉంటుంది. హుడ్ కింద, గెలాక్సీ ఎస్23 అల్ట్రా పవర్‌హౌస్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌తో అమర్చబడి ఉంటుంది. ఆండ్రాయిడ్ డివైజ్‌ల కోసం బెస్ట్ చిప్ అని చెప్పవచ్చు. ర్యామ్ (12జీబీ), 1టీబీ వరకు స్టోరేజ్ మల్టీ టాస్కింగ్, మొత్తం డేటా స్టోరేజీని అందిస్తుంది. భారీ 5,000ఎంఎహెచ్ బ్యాటరీ ఒక రోజంతా ఒకే ఛార్జ్‌పై వస్తుంది.

Samsung Galaxy S23 Ultra

2. వన్‌ప్లస్ ఓపెన్ :
వన్‌ప్లస్ ఓపెన్ ఫుల్ సైజ్ ఫోల్డబుల్ ఫోన్‌లలో ఇదే అగ్రగామిగా నిలిచింది. వన్‌ప్లస్ ఓపెన్ ధర ప్యాకేజీపై ఆధారపడి ఉంటుంది. అద్భుతమైన 120హెచ్‌జెడ్ అమోల్డ్ ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ రెండింటినీ డిస్‌ప్లే చేస్తుంది. రెండూ 2,800 నిట్‌ల వద్ద ఉన్నాయి. హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ ఉంది. 16జీబీ ర్యామ్ 512జీబీ స్టోరేజీతో వస్తుంది.

OnePlus Open

హాసెల్‌బ్లాడ్ ద్వారా ట్యూన్ చేసిన మల్టీఫేస్ కెమెరా సిస్టమ్, వివిధ రకాల లైటింగ్ పరిస్థితులలో అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. 4,800ఎంఎహెచ్ బ్యాటరీ, ఫోల్డబుల్ ఫోన్‌లలో అతిపెద్దది. బాక్స్‌లో ఛార్జర్‌తో 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు, దాదాపు 40 నిమిషాల్లో పూర్తి ఛార్జింగ్‌ అవుతుంది. దాదాపు రూ. 1,40,000 వద్ద, శాంసంగ్ ఆఫర్‌లకు హై-క్వాలిటీ ఫోల్డబుల్ ప్రత్యామ్నాయాన్ని కోరుకునే యూజర్లకు వన్‌ప్లస్ ఓపెన్ బెస్ట్ ఆప్షన్‌గా అని చెప్పవచ్చు.

3. ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ :
ఆపిల్ ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్ర మ్యాక్స్ విషయానికి వస్తే.. సైజు, ధర మాత్రమే ముఖ్యమైన తేడాలుగా చెప్పవచ్చు. ఏదేమైనా, ఐఫోన్ ప్రో సిరీస్ ముందున్న దానితో పోలిస్తే.. మెరుగైన ఎర్గోనామిక్స్‌ని కలిగి ఉంది, ఇందులో తేలికైన టైటానియం ఫ్రేమ్, స్లిమ్మెర్ బెజెల్స్, టైప్-సి పోర్ట్, యాక్షన్ బటన్, లాగ్ వీడియోలను షూట్ చేయొచ్చు. ఐఫోన్ ప్రో, ప్రో మ్యాక్స్ వేరియంట్‌ల మధ్య ధరలో చాలా తేడా ఉంటుంది. పెద్ద స్క్రీన్, కొంచెం బ్యాటరీ లైఫ్ ఎక్కువ అందిస్తుంది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లేదా ఐఫోన్ 15 ప్రో రెండింటిలో ఏదైనా ఫ్లాగ్‌షిప్ ఆప్షన్లుగా ఎంచుకోవచ్చు.

iPhone 15 Pro, 15 Pro Max

4. శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5 :
శాంసంగ్ జాబితాలో ఈ ఏడాది ప్రారంభంలో గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 మోడల్స్ వచ్చాయి. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 అత్యంత సామర్థ్యం గల ఫోల్డబుల్ ఫోన్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. రూ. 90వేలలో పెద్ద కవర్ డిస్‌ప్లేతో పాటు కాంపాక్ట్ డిజైన్ కలిగి ఉంది. ఈ ఫోల్డబుల్ ఫోన్‌ను విప్పకుండా అవసరమైన ఫీచర్‌లను యాక్సెస్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది.

Samsung Galaxy Z Flip 5

శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్, మల్టీఫేస్ కెమెరా సిస్టమ్‌తో సహా టాప్-టైర్ ఇంటర్నల్‌లతో గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5తో వస్తుంది. స్టైలిష్ డిజైన్, జీరో-గ్యాప్ కీ, కలర్ ఆప్షన్లను కలిగి ఉంది. కాంపాక్ట్, ఫీచర్-ప్యాక్డ్ ఫోల్డబుల్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే యూజర్ల కోసం గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ధర విభాగంలో అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.

Read Also : Redmi 13C vs Redmi 12C : రెడ్‌మి 13సి లేదా రెడ్‌మి 12సి ఫోన్లలో ఏది కొంటే బెటర్? ధర, ఫీచర్ల వివరాలివే..!

ట్రెండింగ్ వార్తలు