Bounce Infinity E1X Scooter : కొంటే ఈ స్కూటర్ కొనాలి.. రూ.55వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్‌.. బ్యాటరీ స్వాపింగ్ చేసుకోవచ్చు!

Bounce Infinity E1X Scooter : ఈ ఎలక్ట్రిక్ స్టార్టప్ కంపెనీ కొత్త ఈవీ స్కూటర్లను విక్రయిస్తోంది. అందులో ఇన్ఫినిటీ E1 మోడల్ ఒకటి. దీనికి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఇన్ఫినిటీ ఈ1 ఎక్స్ స్కూటర్‌ స్మార్ట్‌ అప్‌గ్రేడ్‌లతో లాంచ్ చేసింది.

Bounce Infinity E1X Electric Scooter ( Image Credit : Google )

Bounce Infinity E1X Scooter : ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ బౌన్స్ ఇన్ఫినిటీ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ తీసుకొచ్చింది. బెంగళూరుకి చెందిన ఈవీ స్కూటర్‌ బ్యాటరీ స్వాపింగ్ ఆప్షన్‌తో వచ్చింది. ఈ కొత్త బౌన్స్ ఇన్ఫినిటీ ఈవీ స్కూటర్‌ జూన్‌ నుంచి కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. ఈ ఎలక్ట్రిక్ స్టార్టప్ కంపెనీ కొత్త ఈవీ స్కూటర్లను విక్రయిస్తోంది. అందులో ఇన్ఫినిటీ E1 మోడల్ ఒకటి. దీనికి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఇన్ఫినిటీ ఈ1 ఎక్స్ స్కూటర్‌ స్మార్ట్‌ అప్‌గ్రేడ్‌లతో లాంచ్ చేసింది.

ఇప్పటికే, భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్ వినియోగం పెరిగింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సబ్సిడీని అందిస్తున్నాయి. దాంతో కస్టమర్లు ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటుతో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ముందుకు వస్తున్నారు.

Read Also : Anant Ambani-Radhika 2 Pre-Wedding : అనంత్ అంబానీ రాధికల రెండో ప్రీ-వెడ్డింగ్.. సెలబ్రిటీలు ఎవరెవరు హాజరుకానున్నారంటే?

ఈ నేపథ్యంలో ఈవీ బ్యాటరీ స్వాపింగ్ బెస్ట్‌ ఆప్షన్‌ అందిస్తోంది. ఇంట్లో ఛార్జింగ్‌ ఎక్కువ సమయం పడితే.. మీకు దగ్గరలోని ఛార్జింగ్ సెంటర్‌కు వెళ్లి ఫుల్ ఛార్జింగ్ బ్యాటరీని పొందొచ్చు. ముఖ్యమైన నగరాల్లో బ్యాటరీ స్వాపింగ్ సెంటర్లను సైతం ఏర్పాటు చేసింది. ఈ కొత్త ఇన్ఫినిటీ ఇ1ఎక్స్ ఈవీ స్కూటర్‌ కొనుగోలు చేయొచ్చు.

గంటకు 65కి.మీ టాప్ స్పీడ్ :
మీ సమీప ఛార్జింగ్ సెంటర్లలో బ్యాటరీని ఎక్స్ఛేంజ్ చేయొచ్చు. బౌన్స్ ఈ1ఎక్స్ మొత్తం 2 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఒక వేరియంట్ గరిష్ట వేగం గంటకు 55కి.మీ అందిస్తుండగా.. మరో ఈవీ స్కూటర్‌ టాప్ స్పీడ్ గంటకు 65కి.మీ వేగాన్ని అందిస్తుంది.

బౌన్స్ ఇన్ఫినిటీ ఈ-స్కూటర్లను వ్యక్తిగత కస్టమర్లు మాత్రమే కాదు.. కార్పొరేట్ కంపెనీలు సైతం కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. బౌన్స్ ఇన్ఫినిటీ కంపెనీ 30వేల ఎలక్ట్రిక్ వాహనాలను సరఫరా చేసేందుకు సన్ మొబిలిటీతో డీల్ కుదుర్చుకుంది. లాస్ట్ మైల్ డెలివరీ, ఫుడ్ డెలివరీ కంపెనీలతో టై అప్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఎంతంటే?
ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ మార్కెట్లో మొదటిస్థానంలో నిలిచేలా కృషిచేస్తామని సంస్థ సీఈవో కో-ఫౌండర్‌ వివేకానంద హల్లెకరే పేర్కొన్నారు. ఈ కొత్త బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.55వేల నుంచి రూ.59వేల మధ్య ఉంటుంది. ఈ కంపెనీ లైనప్‌లో స్కూటర్ల ధరలను 21శాతం తగ్గించింది. బౌన్స్ కంపెనీలో బెంగళూరు, ముంబై, పూణె, ఢిల్లీ, హైదరాబాద్‌ నగరాల్లో కూడా స్కూటర్లను విక్రయిస్తోంది. ఈవీ స్కూటర్ల ధరలు భారీగా తగ్గడంతో కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఎగబడుతున్నారు.

Read Also : Apple WWDC 2024 Event : ఆపిల్ WWDC 2024 కీనోట్ ఈవెంట్ టైమ్, ఫుల్ షెడ్యూల్.. ఏయే ప్రకటనలు ఉండొచ్చు? లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే?

ట్రెండింగ్ వార్తలు