Anant Ambani-Radhika 2 Pre-Wedding : అనంత్ అంబానీ రాధికల రెండో ప్రీ-వెడ్డింగ్.. సెలబ్రిటీలు ఎవరెవరు హాజరుకానున్నారంటే?

Anant Ambani-Radhika 2 Pre-Wedding : అనంత్-రాధిక రెండో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌ ఇటలీ, ఫ్రాన్స్‌లలో నిర్వహిస్తున్నారు. ఈ వేడుక మే 29 మొదలై.. జూన్ 1 వరకు జరుగుతుంది.

Anant Ambani-Radhika 2 Pre-Wedding : ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి పెళ్లివేడుక నిర్వహించారని గ్రాండ్‌గా వెడ్డింగ్‌ సెరమనీ గురించి కవులు వర్ణిస్తారు. ఇప్పుడు దానికి తగ్గట్టే పెళ్లి వేడుకలు నిర్వహిస్తోంది అంబానీ ఫ్యామిలీ. అనంత అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహం ఇప్పుడు మరోసారి టాక్‌ ఆఫ్‌ది వరల్డ్‌ గా మారిపోయింది. ఎక్కడ చూసినా అంబానీ ఇంట పెళ్లి వేడుకపైనే చర్చించుకుంటున్నారు. ఇప్పుడు రాజప్రాసాదాలు, ఫంక్షన్‌ హాళ్లు దాటి క్రూయిజ్‌ సెలబ్రేషన్స్‌కు సిద్ధమైంది ముకేశ్‌ అంబానీ కుటుంబం. తన గారాల పుత్రుడి పెళ్లివేడుకకు ఇటు భూమి, అటు ఆకాశమే హద్దుగా చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా సముద్రంలో నిర్వహిస్తోంది.

Read Also : Poco F6 5G Sale : పోకో F6 5జీ ఫోన్ సేల్ మొదలైందోచ్.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు.. లాంచ్ ఆఫర్లు ఇదిగో!

4 రోజుల పాటు గ్రాండ్‌ సెలబ్రేషన్స్‌ :
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల రెండో ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ నేటి నుంచి ఆరంభం కానున్నాయి. 7000 కోట్ల విలువైన లగ్జరీ క్రూయిజ్ షిప్‌లో 4 రోజుల పాటు గ్రాండ్‌గా ఫంక్షన్స్ జరగనున్నాయి. ఇటలీ నుంచి ఫ్రాన్స్ మధ్య 4 వేల కిలోమీటర్లకు పైగా క్రూయిజ్ షిప్‌ ప్రయాణిస్తుంది. దాంతో అతిథులు యూరోపియన్, మధ్యధరా సముద్ర అందాలను బాగా ఎంజాయ్ చేయనున్నారు. మే 29 నుంచి జూన్‌ 1 వరకు జరిగే క్రూయిజ్‌ సెలబ్రేషన్స్‌కు ప్రత్యేకమైన మెనూ, డ్రెస్‌ కోడ్స్‌ కూడా ఉన్నాయి. షెడ్యూల్‌ ప్రకారం జరిగే ఈ వేడుకలను.. ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీ అతిథులందరికీ మర్యాదల్లో ఎలాంటి లోపం ఉండకుండా దగ్గరుండి చూసుకుంటున్నారు. జులైలో జరిగే ఈవెంట్‌ కోసం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

మార్చిలో జామ్‌ జామ్‌ అంటూ జరిగిన జామ్‌ నగర్‌ ప్రీవెడ్డింగ్‌ వేడుకలకంటే భిన్నంగా.. ఈ రెండో ప్రీవెడ్డింగ్‌ వేడుకల్ని ప్లాన్‌ చేశారు. యూరోపియన్‌ క్రూయిజ్‌లో కనీవినీఎరుగని పార్టీలతో ఈ సెలబ్రేషన్స్‌ జరుగుతాయి. రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌, సల్మాన్‌ ఖాన్‌, ఎంఎస్‌ ధోనీ, ధోనీ సతీమణి సాక్షి.. ఇలా వీవీఐపీలంతా అనంత్‌ అంబానీ, రాధికామర్చంట్‌ సముద్రంలో నిర్వహించే పెళ్లివేడుకలకు వెళ్తున్నారు. బాలీవుడ్‌ సెలబ్రిటీలు, క్రికెటర్లు, బడా వ్యాపారవేత్తలు, దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు.

ఇప్పటికే ఫస్ట్‌ ప్రీ వెడ్డింగ్‌ను గ్రాండ్‌గా నిర్వహించి పదికాలాలు గుర్తుండిపోయే జ్ఞాపకాలను అతిథులకు అందించింది అనంత్‌ అంబానీ కుటుంబం. అతిరథమహారథులకు మరిచిపోలేని ఆతిథ్యాన్ని అందించారు. దగ్గరుండి అతిథులకు వడ్డించడం దగ్గర్నుంచి ప్రతి కార్యక్రమాన్నీ ఎంతో సంతోషంగా నిర్వహించారు. ఇప్పుడు ఈ క్రూయిజ్‌ సెలబ్రేషన్స్‌తో సెకండ్‌ ప్రీ వెడ్డింగ్‌ సెరమనీ చేస్తున్నారు. దీనికోసం ఇటలీలో లగ్జరీ క్రూయిజ్‌ను బుక్‌ చేశారు అంబానీ.

దాదాపు 8 వందల మంది ముఖ్యఅతిథులను సముద్రంలో నిర్వహించే ఈ లగ్జరీ క్రూయిజ్‌ ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌కు ఆహ్వానిస్తున్నారు. ఇటలీ నుంచి ఫ్రాన్స్‌ వరకు ఈ లగ్జరీ క్రూయిజ్‌ ప్రయాణిస్తుంది. స్టార్‌ నైట్‌తో అతిథులకు ఆహ్వానం పలుకుతారు. మే 30న అతిథులంతా రోమ్‌లో ల్యాండ్‌ అవుతారు. అక్కడ డిన్నర్‌ ముగించుకుని.. మే 31 ఉదయం అతిపెద్దదైన ఇటాలియన్‌ క్రూయిజ్‌ వద్దకు చేరుకుంటారు. జూన్‌ 1న ఇటలీలో వేడుకలు నిర్వహిస్తారు.

మే 29 నుంచి జూన్‌ 1 వరకు క్రూయిస్‌ సెలబ్రేషన్స్‌ :
అనంత్-రాధిక రెండో ప్రీ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్‌పై బోల్డ్ లెటర్స్‌లో ‘లా విట్ ఈ అన్ వియాజియో’ అని రాసుంది. అంటే ‘లైఫ్ ఈజ్ ఎ జర్నీ’ అని అర్ధం. రెండో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌ని ఇటలీ, ఫ్రాన్స్‌లలో నిర్వహిస్తున్నారు. ఈ వేడుక మే 29 మొదలై.. జూన్ 1 వరకు జరుగుతుంది. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుక మొదటి రోజున ‘పార్టీ వెల్‌కమ్ లంచ్’ థీమ్‌తో ప్రారంభమవుతుంది. సాయంత్రం ‘స్టార్రీ నైట్’ థీమ్ ఉంటుంది. రెండో రోజు ‘ఎ రోమన్ హాలిడే’ థీమ్‌తో కొనసాగుతుంది. రెండోరోజు లా డోల్స్ ఫార్ నియంతే, టోగా పార్టీ ఉంటుంది.

దాదాపు ఆరువందల మంది క్రూయిజ్‌ సిబ్బంది అతిథులకు సేవలు అందిస్తారు. జామ్‌ నగర్‌ వేడుకల్లో సల్మాన్‌ ఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌, రణ్‌వీర్‌ సింగ్‌ , ఆమీర్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌ ఇలా స్టార్స్‌ చేసిన సందడి అంతాఇంతా కాదు. ఇప్పుడు ఈ క్రూయిజ్‌ ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు ఆహ్వానాలందాయి. దక్షిణ ఇటలీలోని పలెర్మో ఐల్యాండ్‌.. సముద్రంలో ప్రీ వెడ్డింగ్‌ వేడుకకు వేదికయ్యింది. స్టార్‌ నైట్‌కోసం అతిథులంతా ఫార్మల్‌ డ్రెస్సులు ధరిస్తారు. ఆ తర్వాత జరిగే థీమ్‌ పార్టీలో డ్రెస్‌కోడ్‌ ఉంటుంది.

600 మంది క్రూయిస్‌ సిబ్బంది సేవలు :

టోగా పార్టీలో గ్రీస్‌, రోమన్‌ తరహా కాస్ట్యూమ్స్‌ ధరిస్తారు. లైఫ్‌ఈజ్‌ఏ జర్నీ థీమ్‌తో ఈ సెలబ్రేషన్స్‌ జరుగుతాయి. ఆకాశ్‌ అంబానీ-శ్లోకా మెహతాల కుమార్తె వేద మొదటి పుట్టినరోజు 3వ రోజు జరుపుకుంటారు. ఇక చివరి రోజు థీమ్ ‘లా డోల్స్ వీటా’. ఈ ప్రీ వెడ్డింగ్ కోసం 800 మంది అతిథులు రానున్నారు. ఇందులో బాలీవుడ్ ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలు, అంతర్జాతీయ ప్రముఖులు ఉన్నారు. వీరికోసం క్రూయిజ్‌లో 600 మంది ఉద్యోగులు పని చేస్తారు.

ఈ పార్టీ కోసం షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, అలియా భట్ వంటి స్టార్స్ వెళ్లారట. అనంత్-రాధిక మొదటి ప్రీ వెడ్డింగ్ జామ్‌నగర్‌లో జరగ్గా.. అంబానీ కుటుంబం దాదాపు 13 వందల కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు క్రూయిస్‌ సెలబ్రేషన్స్‌కోసం కూడా వేల కోట్లు ఖర్చు చేస్తోంది. జూలై 12న జియో వరల్డ్ సెంటర్‌లో మూడుముళ్ల బంధంతో అనంత్‌ రాధిక వివాహం అంగరంగవైభవంగా జరగనుంది.

Read Also : Anant Ambani Luxury Watch : మొబైల్స్ వచ్చినా వాచ్‌లకు తగ్గని క్రేజ్.. అనంత్ మాత్రమే కాదు.. గాంధీ టు టామ్ క్రూయిస్ వరకు.. ప్రతి గడియారానికో చరిత్ర ఉంది!

ట్రెండింగ్ వార్తలు