Good Credit Card Score : గుడ్ క్రెడిట్ స్కోర్ పెరగాలంటే.. మీ క్రెడిట్ కార్డు ఎలా వాడాలో తెలుసా? ఈ 5 విషయాలు తప్పక పాటించండి!

Credit Card Score : మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? మీ క్రెడిట్ స్కోరు ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. క్రెడిట్ కార్డును (How to Use Credit Card Wisely) ఎలా పడితే అలా వాడేశారంటే ఇబ్బందుల్లో పడిపోతారు జాగ్రత్త..

Good Credit Card Score : మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ప్రస్తుత రోజుల్లో చాలామంది క్రెడిట్ కార్డు వాడకం (Credit Card Usage) తప్పనిసరిగా మారిపోయింది. షాపింగ్ కోసమో లేదా ఇతర ఆన్‌లైన్ లావాదేవీల కోసమో క్రెడిట్ కార్డులను తెగ వాడేస్తుంటారు. రెగ్యులర్ ఖర్చుల కోసం మీ క్రెడిట్ కార్డ్‌ని (How to Use Credit Card Wisely) ఉపయోగించడం, బకాయిలను సకాలంలో పూర్తిగా తిరిగి చెల్లించడం ద్వారా మంచి క్రెడిట్ స్కోర్‌ (How to Increase Credit Score) పెరగడంలో సాయపడుతుంది. వాస్తవానికి.. క్రెడిట్ కార్డు అనేది ఈజీ మనీ కాదు.. అది సరైన పద్ధతిలో వాడకుంటే మాత్రం సరదా తీర్చేస్తుంది. క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం అనేది లోన్ తీసుకోవడంతో సమానమని మర్చిపోవద్దు.

ఎందుకంటే.. మీ తరపున చెల్లించే కార్డు జారీదారుడికి మీరు ఆ మొత్తాన్ని వాడిన తర్వాత తిరిగి చెల్లిస్తారు. క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన లావాదేవీలు (CIBIL) వంటి క్రెడిట్ బ్యూరోలకు రిపోర్టు చేస్తుంటారు. మీ క్రెడిట్ స్కోర్‌ను అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. క్రెడిట్ స్కోర్ మీ క్రెడిట్ యోగ్యత తిరిగి చెల్లించే ప్రవర్తనను ప్రతిబింబిస్తుంది. మీరు క్రెడిట్ కార్డ్‌లను ఎలా హ్యాండిల్ చేస్తారు అనేదానిపై మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావాన్ని అంతిమంగా నిర్ణయిస్తుంది. క్రెడిట్ కార్డ్‌ల ద్వారా లావాదేవీలు చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఫాలో చేయాల్సిన 5 విషయాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

Read Also : Apple iPhone 12 Price Drop : ఈ పండుగ సీజన్‌లో ఆపిల్ ఐఫోన్ 12పై భారీ తగ్గింపు.. ఇదే బెస్ట్ టైం.. ఇప్పుడే కొనేసుకోండి..!

1. మీ బకాయిలను సకాలంలో (Pay Dues ontime) చెల్లించండి :
మీ పేమెంట్లు, క్రెడిట్ కార్డ్ బిల్లులు లేదా లోన్ EMIలు ఏదైనా కావచ్చు. మీ క్రెడిట్ స్కోర్‌కు అవే ముఖ్యం.. మీరు ప్రతిసారీ మీ బకాయి బ్యాలెన్స్‌లను సకాలంలో చెల్లించడం చాలా అవసరం. మీరు మీ పేమెంట్ చెల్లించలేకపోయిన ప్రతిసారీ, మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. మీరు సకాలంలో తిరిగి చెల్లించిన ప్రతిసారీ మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది.

How to use your credit card for good credit score

2. మీ బిల్లులను పూర్తిగా (Pay Full Credit Bills)  చెల్లించండి :
వీలైనంత వరకు.. మీ మొత్తం క్రెడిట్ కార్డ్ బకాయిలను గడువు తేదీకి ముందు ప్రతిసారీ చెల్లించండి. ఏవైనా కారణాల వల్ల మీరు మొత్తం మొత్తాన్ని చెల్లించలేకపోతే.. కనీస మొత్తాన్ని (Mininum Due) మాత్రమే కాకుండా గరిష్టంగా చెల్లించడానికి ప్రయత్నించండి. అందులో ఒకటి.. క్రెడిట్ కార్డ్‌పై వడ్డీ చెల్లించని మొత్తంపై చాలా ఎక్కువ వడ్డీ పడుతుంది. తద్వారా మీ తిరిగి చెల్లించాల్సిన ప్రిన్సిపుల్ అమౌంట్‌పై కూడా భారం పెరుగుతుంది. రెండోది.. క్రెడిట్ తెగ వాడేస్తున్నారనే భావన కలిగిస్తుంది.

3. మీ క్రెడిట్ లిమిట్ వినియోగం (Credit Over Limit) తక్కువగా ఉండాలి :
క్రెడిట్ బ్యూరోలు.. మీ క్రెడిట్‌ని ఎలా ఉపయోగిస్తున్నారో కూడా చూస్తాయి. క్రెడిట్ కార్డు ఉంది కదా అని ఎలా పడితే అలా వాడేయకూడదు. మీ క్రెడిట్ లిమిట్‌లో కొంత భాగాన్ని మాత్రమే ఉపయోగించండి. మీ క్రెడిట్ వినియోగ రేషియో క్రమం తప్పకుండా మీ క్రెడిట్ లిమిట్‌లో 10-40శాతం మించకుండా చూసుకోండి. లేదంటే.. తరచుగా ఉల్లంఘించే రుణగ్రహీతలకు రుణదాతలు సాధారణంగా రుణం ఇవ్వడానికి వెనుకాడతారు. మీ క్రెడిట్ వినియోగాన్ని తగ్గించడానికి క్రెడిట్ లిమిట్ పెంచడాన్ని కూడా పరిగణించవచ్చు. బాధ్యతాయుతమైన పద్ధతిలో క్రెడిట్‌ని ఉపయోగించే వ్యక్తిగా కనిపించేలా చేస్తుంది.

How to use your credit card wisely

4. మీ క్రెడిట్ ఎంక్వైరీలు (Credit Inquires) ఎక్కువ చేయొద్దు :
మీరు క్రెడిట్ కార్డు కోసం అప్లయ్ చేసిన ప్రతిసారీ క్రెడిట్ కార్డ్ లేదా లోన్ ఒక ప్రశ్న క్రెడిట్ బ్యూరోకి వెళుతుంది. మీ క్రెడిట్ స్కోర్‌లో చిన్న దెబ్బ పడుతుంది. క్రెడిట్ కార్డులు లేదా లోన్ల కోసం యాదృచ్ఛికంగా అప్లయ్ చేయవద్దు. క్రెడిట్ కార్డు కోసం రీసెర్చ్ సరిగ్గా చేయాలి. క్రెడిట్ ఆమోదానికి అత్యధిక సంబంధిత ఆఫర్‌ను తగ్గించి ఆపై కార్డు కోసం అప్లయ్ చేసుకోవాలి. ప్రతి కొత్త క్రెడిట్ అకౌంట్ కూడా మీ సగటు క్రెడిట్ వయస్సును తగ్గిస్తుందని గమనించాలి. ఒకదాని తర్వాత ఒకటి కొత్త క్రెడిట్ అకౌంట్లను ఓపెన్ చేయడం మానుకోండి. లేదంటే మీ క్రెడిట్ స్కోర్ భారీగా తగ్గిపోతుంది.

5. మీ క్రెడిట్ రిపోర్టు చెక్ (Credit Report Check) చేయండి :
క్రెడిట్ బ్యూరో నుంచి నేరుగా మీ క్రెడిట్ స్కోర్‌ను అభ్యర్థించవచ్చు. ఇలా చేయడం వల్ల మీ క్రెడిట్ స్కోర్‌పై ఎఫెక్ట్ పడదు. మీ క్రెడిట్ స్కోర్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయడం వల్ల ఎలాంటి వ్యత్యాసాలు లేదా లోపాలు రిపోర్టు చేయలేదని నిర్ధారిస్తుంది. మీ క్రెడిట్ స్కోర్ మీ ఆర్థిక ప్రవర్తనను సూచిస్తుంది. ఏవైనా సమస్యలు ఉంటే త్వరగా వాటిని సరిదిద్దవచ్చు. తద్వారా క్రెడిట్ స్కోరు దెబ్బతినకుండా జాగ్రత్త పడవచ్చు.

Read Also : Flipkart Big Billion Day Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 14, మోటో ఎడ్జ్ 40 ఫోన్లపై టాప్ డీల్స్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి!

ట్రెండింగ్ వార్తలు