Apple iPhone 12 Price Drop : ఈ పండుగ సీజన్‌లో ఆపిల్ ఐఫోన్ 12పై భారీ తగ్గింపు.. ఇదే బెస్ట్ టైం.. ఇప్పుడే కొనేసుకోండి..!

Apple iPhone 12 Price Drop : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) సందర్భంగా అనేక డిస్కౌంట్లు, ఇతర ఆఫర్‌లను అందిస్తోంది.

Apple iPhone 12 Price Drop : మీరు ఆపిల్ ఐఫోన్ అభిమాని అయితే.. పండుగ సీజన్‌లో కొనుగోలుకు ఇదే బెస్ట్ టైమ్.. అనేక ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఐఫోన్‌ల ధరలను భారీగా తగ్గిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల ఐఫోన్ 15 సిరీస్‌ను (iPhone 15 Series Launch) లాంచ్ చేసిన తర్వాత చాలా పాత ఐఫోన్ మోడల్స్ ధరలు అమాంతం తగ్గిపోయాయి. ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart Sale) సేల్‌‌లో ఐఫోన్ 12 (Apple iPhone 12 Sale Offers)పై అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. మరిన్ని ఆఫర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఐఫోన్ 12 ధర ఎంత తగ్గిందంటే? :
128 GB స్టోరేజీతో బ్లూ కలర్‌లో ఉన్న ఆపిల్ ఐఫోన్ 12 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో గణనీయమైన తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ అసలు ధర రూ.54900కి బదులుగా రూ.45999కు సొంతం చేసుకోవచ్చు. ఈ ధరలో 16 శాతం తగ్గింపును అందిస్తుంది. ఐసిఐసిఐ (ICICI Bank) బ్యాంక్ డెబిట్ కార్డ్‌ని ఉపయోగించే కస్టమర్‌లకు అదనంగా 10 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది.

Read Also : Google Pixel 8 Series Sale : భారత్‌లో ఫస్ట్ టైం.. గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ సేల్.. ధర, లాంచ్ ఆఫర్లు మీకోసం..

దీని ద్వారా రూ.5వేలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆర్డర్‌లపై రూ.750 వరకు ఆదా చేసుకోవచ్చు. అదనంగా, కస్టమర్‌లు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు. పాత డివైజ్‌లపై ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.39150 వరకు సేవింగ్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌కు అర్హతను పొందాలంటే మీ లొకేషన్ పిన్ కోడ్‌ను ఎంటర్ చేసుకోవాలి.

ఐఫోన్ 12ని ఎందుకు కొనాలంటే? :
ఐఫోన్ 12 మోడల్ 128GB ఇంటర్నల్ స్టోరేజీ, 15.49cm (6.1 అంగుళాలు) సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో సహా ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది. ఐఫోన్ కెమెరా సెటప్‌లో వెనుకవైపు 12MP డ్యూయల్-లెన్స్ సిస్టమ్, 12MP (TrueDepth) ఫ్రంట్ కెమెరా, హై-క్వాలిటీ ఫొటోలు, వీడియోలను నిర్ధారిస్తుంది.

Apple iPhone 12 Price Drop

ఈ డివైజ్ A14 బయోనిక్ చిప్, నెక్స్ట్ జనరేషన్ న్యూరల్ ఇంజిన్ ప్రాసెసర్‌తో ఉంటుంది. అంతేకాదు.. స్పీడ్, సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది. అదనంగా, ఐఫోన్ సిరామిక్ షీల్డ్ టెక్నాలజీని అందిస్తుంది. ఫలితంగా 4 రెట్లు మెరుగైన పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. పరిశ్రమలో అగ్రగామిగా IP68 వాటర్ రెసిస్టెన్స్, మరింత మన్నికైనదిగా చేస్తుంది.

ఐఫోన్ 12 మోడల్ డాల్బీ విజన్ HDR రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అసాధారణమైన క్వాలిటీతో వీడియోలను రికార్డ్ చేయడానికి, ఎడిట్ చేయడానికి ప్లేబ్యాక్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. AirPlayని ఉపయోగించి (Apple TV) లేదా స్మార్ట్ టీవీలకు కంటెంట్‌ను ప్రసారం చేయగలదు.

నైట్ మోడ్ టైమ్-లాప్స్ వీడియో ఫీచర్ ట్రైపాడ్ క్యాప్చర్ చేసేందుకు అనుమతిస్తుంది. అయితే, 10-బిట్ HDR వీడియో రికార్డింగ్ సాంప్రదాయ 8-బిట్ వీడియో రికార్డింగ్‌తో పోలిస్తే.. 60 రెట్లు ఎక్కువ రంగులను అందిస్తుంది. ఆపిల్ ఐఫోన్ 12 ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి ఉంది. అదనపు సేవింగ్స్ కూడిన తగ్గింపు ధరలో పర్ఫార్మెన్స్, క్వాలిటీతో అందిస్తుంది.

Read Also : Tech Tips in Telugu : మీ PCలో OS ఏదైనా సరే.. సింపుల్‌గా స్ర్కీన్‌షాట్ తీసుకోవచ్చు తెలుసా? ఇదిగో ప్రాసెస్ మీకోసం..!

ట్రెండింగ్ వార్తలు